AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికి పోలీసులకు మస్కా కొట్టి పరారయిన మందుబాబు

వెంగల్ రావు పార్క్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులను మభ్యపెట్టిన మందుబాబు.. ఆడీ కార్ డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్ వెతుకుతున్నట్లు నటించి.. సీజ్ చేసిన కారులోనే పరారయ్యాడు. మద్యం సేవించినట్లు నిర్ధారణ అయిన వ్యక్తి, తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడికో జారుకున్నాడు. పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు ప్రారంభించారు.

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లో దొరికి పోలీసులకు మస్కా కొట్టి పరారయిన మందుబాబు
Drunk And Drive
Ram Naramaneni
|

Updated on: Jun 28, 2025 | 8:07 AM

Share

హైదరాబాద్‌లో ఓ మందుబాబు ట్రాఫిక్ పోలీసులకు మస్కా కొట్టాడు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీసులు వెంగల్ రావు పార్క్ గేటు ముందు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. తనిఖీల్లో మొత్తం 5 బైకులు, 3 కార్లు పట్టుబడ్డాయి. అయితే అందులో ఒక బ్లూ కలర్ ఆడి కార్ (టీఎస్ 09 FD 1116) డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మద్యం సేవించి నడుపుతూ పోలీసులకు చిక్కింది.

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా కారులో ఉన్న వ్యక్తి మద్యం సేవించినట్లు కన్ఫామ్ అయ్యింది. డ్రైవింగ్ లైసెన్స్ కారు లోపల వెతుకుతున్నట్లు నటించిన ఆ వ్యక్తి.. అదే సమయానికి మిగతా వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులకు బురిడీ కొట్టి.. సీజ్ చేసిన కారులోనే పారిపోయాడు. పోలీసుల విచారణలో ఆ కార్ వెంకటేశ్వర ప్యాకేజింగ్ పేరుతో ద్వారకపురి, పంజాగుట్ట అడ్రస్‌లో రిజిస్టర్ అయినట్లు వెల్లడైంది. పరారైన వ్యక్తి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో అతని ఆచూకీ అందుకోవడం కష్టంగా మారింది. సదరు వ్యక్తిపై కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు.. పరారైన మందుబాబును ట్రేస్ చేయడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?