
హైదరాబాద్(Hyderabad) నగరంలోని పాతబస్తీలో ఓపెన్ నాలాలు ప్రమాదకరంగా మారాయి. తాజాగా పత్తర్‌గట్టి డివిజన్‌లోని దీవాన్‌దోడి ప్రాంతంలో ఓపెన్‌నాలాలో ఓ వ్యక్తి బైక్‌తో సహా పడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సదరు వ్యక్తిని బయటకు తీశారు. ఈ ప్రాంతంలో గత ఐదు నెలలుగా ఓపెన్ నాలాలను నిర్లక్ష్యంగా వదిలేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం సైన్‌బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదని, దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాతబస్తీలో రంజాన్ సీజన్‌లో ఎక్కడ చూసినా జనం రద్దీ అధికంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ఓపెన్ నాలాలు ప్రాణాంతకంగా మారాయని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. కాంట్రాక్టర్‌తో పాటు సంబంధిత అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Hyderabad Patabasti Drain
– నూర్ మహమ్మద్, టీవీ9 తెలుగు, హైదరాబాద్
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Viral Video: నరకాని చూసేందుకు జనం క్యూ..! కొద్ది రోజులు మాత్రం తెలిచి ఉంటుంది అంట..!