Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా బాత్రూంలోని వెంటిలేటర్ నుంచి కనిపించిన లైట్.. పరిశీలించగా

స్నానం చేస్తుండగా వెంటిలేటర్‌ ద్వారా మొబైల్ ఫోన్ కనిపించడం కలకలం రేపింది. బోడుప్పల్‌లోని శ్రీలక్ష్మీనగర్‌లో మహిళను రహస్యంగా వీడియో తీయడానికి ప్రయత్నించిన ఘటనపై మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి .. .. ... ..

Hyderabad: మహిళ స్నానం చేస్తుండగా బాత్రూంలోని వెంటిలేటర్ నుంచి కనిపించిన లైట్.. పరిశీలించగా
Ventilator

Edited By:

Updated on: Dec 20, 2025 | 9:56 PM

సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. కామాంధులు ఎక్కడి వెళ్లినా వదిలి పెట్టడం లేదు. సొంత ఇంట్లో కూడా సేఫ్టీ లేకుండా పోతుంది. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసే ప్రయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం.. బోడుప్పల్‌లోని శ్రీలక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న 29 ఏళ్ల మహిళ డిసెంబర్ 18న తన ఇంట్లో స్నానం చేస్తుండగా వెంటిలేటర్ ద్వారా ఓ మొబైల్ ఫోన్ కనిపించింది. ఆ ఫోన్ ద్వారా తనను వీడియో తీస్తున్నట్టు గుర్తించిన మహిళ భయంతో కేకలు వేసింది. మహిళ కేకలు వేయడంతో వెంటనే వీడియో తీస్తున్న వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అనంతరం బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేసింది. ఇంటి చుట్టుపక్కల పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు పక్కింట్లో అద్దెకు ఉంటున్న హరిష్ కుమార్‌పై అనుమానం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై బాధిత కుటుంబం మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు పోలీసులు. నిందితుడిని గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన మహిళల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. రహస్యంగా వీడియోలు తీసే ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఇలాంటి ఉన్మాదులే అత్యాచారాలు, హత్యలకు పాల్పడతారని.. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..