Maganti Ravindra: ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) ఈరోజు మృతి చెందారు. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడంతో (కరోనా కాదు) ఆయనను నగరంలోని ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ కొన్ని రోజుల ట్రీట్మెంట్ తరువాత ఆయన ఆరోగ్యం కుదుట పడకపోవడంతో ఆసుపత్రి నుంచి బయటకు వచ్చేశారు. అయితే, ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి వెళ్ళకుండా హైదరబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ఉంటున్నారు. ఈరోజు ఆయన అకస్మాత్తుగా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. రక్తపు వాంతులు కావడంతో హోటల్ సిబ్బంది ఆయనకు వైద్య సహాయం కోసం ప్రయత్నించే లోపునే మరణించారు. ఈ విషయం పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మాగంటి రవీంద్ర మృత దేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి పోస్ట్ మార్టం కోసం పంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్న పోలీసులు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే మాగంటి బాబు పెద్ద కుమారుడు రాంజీ కూడా మరణించిన విషయం తెలిసిందే.
అయితే, ప్రస్తుతం ఈ ఘటన పై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒక వాదన ప్రకారం మాగంటి రవీంద్ర హోటల్ గదిలో అపస్మారక స్థితిలో పడిపోతే, అయన కుటుంబ సభ్యులు యశోదా ఆసుపత్రికి తరలించారని చెబుతున్నారు. అయితే, అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు నిర్ధారించారని తెలుస్తోంది. ఏది ఏమైనా మాగంటి బాబు ఇద్దరు కుమారులు అకాల మరణం చెందటం కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది.
Also Read: Viral Video: పొట్టుపొట్టుగా తాగాడు.. వధువు మెడలో దండ వేయబోయి.. వరుడి వీడియో వైరల్
తెలంగాణలో తగ్గుతోన్న కరోనా పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్ని నమోదయ్యాయంటే.!