Statue of Equality: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్..

|

May 26, 2024 | 10:28 AM

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మే 25 శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని విచ్చేశారు. 108 దివ్య దేశాలను, స్వర్ణ రామానుజులను దర్శించుకున్నారు.

Statue of Equality: సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్..
Madhya Pradesh Cm Mohan Yadav At Samathamurthy Spirit Center
Follow us on

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బిజీగా గడిపిన రాజకీయ నేతలు, కౌంటింగ్‌కు సమయం ఉండటంతో కాస్త సేద తీరుతున్నారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రల్లో సరదగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మే 25 శనివారం హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని విచ్చేశారు. 108 దివ్య దేశాలను, స్వర్ణ రామానుజులను దర్శించుకున్నారు. తర్వాత శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. దాదాపు మూడున్నర గంటల సమయం ఆశ్రమంలోనే గడిపారు సీఎం మోహన్ యాదవ్‌.

న భూతో న భవిష్యతి అన్న రీతిలో నిర్మితమైన సమతాస్ఫూర్తి కేంద్రంలో ప్రతీ దృశ్యం రమణీయం.. ప్రతీ ఘట్టం మహాద్భుతం. అలాంటి 108 దివ్య దేశాలను ఒకే చోట చేర్చి నిర్మించిన సమతా స్పూర్తి కేంద్రాన్ని చూసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రముగ్ధులయ్యారు. సమతా.. మమత.. సార్వజనీనీత నినాదంగా విశిష్టాద్వైత విశ్వరూపాన్ని సాక్షాత్కారింపచేసిన చినజీయర్ స్వామిని ప్రత్యేక అభినందనలు తెలిపారు సీఎం మోహన్ యాదవ్.

అలాగే కన్హా గ్రామం హార్ట్‌ఫుల్‌నెస్‌ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ధ్యాన కేంద్రమైన ‘కన్హా శాంతి వనం’ను సీఎం మోహన్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునస్వామిని శనివారం సీఎం మోహన్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ నుంచి హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌ ద్వారా సున్నిపెంట చేరుకున్న ఆయన, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం చేరుకున్నారు. ఆలయ రాజగోపురం వద్ద ఆయనకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించుకుని రుద్రాభిషేకం, కుంకుమార్చన నిర్వహించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…