
మొన్నటి వరకు హైదరాబాద్ మెట్రోపై ప్రజలు భారీ ఆదరణ చూపారు. ఎలాంటి ట్రాఫిక్ జంజాటం లేకుండా సాఫీగా గమ్య స్థానాలకు చేరుకునే వెసులుబాటు ఉండడంతా మెజారిటీ ప్రయాణికులు మెట్రో ఆశ్రయించారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. మెట్రోకు క్రమంగా ప్రయాణికులు తగ్గుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రయాణికులు క్రమంగా మెట్రో వినియోగాన్ని తగ్గిస్తున్నారు. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు ప్రయాణం పథకమే.
ఈ విషయమం చెబుతోంది మరెవరో కాదు ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ ఆర్ శంకర్. ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సంస్థకు వస్తున్న నష్టాల నేపథ్యంలో హైదరాబాద్ మెట్రోను విక్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. 2026 తర్వాత మెట్రోను అమ్మేయాలని తాము భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంలో మెట్రోకు నష్టం పెరిగిందని చెబుతున్నారు.
కేవలం పురుషులు మాత్రమే మెట్రోను ఎక్కువగా ఉపయోగిస్తున్నారి శంకర్ చెప్పుకొచ్చారు. అలాగే ఊబర్ , ఓలా, రాపిడో వంటి సంస్థ సేవలు కూడా పెరిగిపోవటంతో.. మెట్రోలో ప్రయాణించేవారి సంఖ్య చాలా వరకు తగ్గిందని శంకర్ తెలిపారు. సంస్థకు వస్తోన్న లోటును పూడ్చుకునేందుకు చర్యలు చేపట్టినా.. ఫలితాన్ని ఇవ్వకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. నష్టం వచ్చే ప్రాజెక్టుల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకొని, లాభాలు వచ్చే వాటిలో పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఇక ఉచిత బస్సు పథకం వల్ల మహిళలు పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులను ఉపయోగిస్తున్నారని, బస్సుల సంఖ్య పెంచకోవడం వల్ల పురుషులు ఎక్కువగా మెట్రోను ఆశ్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే బస్సులను 5 ఏళ్లకు ఒకసారి మెయింటేన్స్ చేయాల్సి వస్తుందని. ఇలా ఉచితంగా ప్రయాణం కల్పిస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారయంటూ ఆర్ శంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై తెలంగాణ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..