Hyderabad: కాసేపట్లో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ ఫుడ్‌బాల్‌ మ్యాచ్.. మినెట్‌ టూ మినెట్‌ పూర్తి వివరాలు ఇవే

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా అర్జెంటీనా ఫుడ్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మెస్సీకి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి అధికారులు. అనంతరం భారీ భద్రత నడుమ ఆయన్ను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన మెస్సీతో మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన నిర్వాహకులు.. మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి. రాత్రి 7.50 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి మెస్సీ.

Hyderabad: కాసేపట్లో మెస్సీ వర్సెస్ సీఎం రేవంత్ ఫుడ్‌బాల్‌ మ్యాచ్.. మినెట్‌ టూ మినెట్‌ పూర్తి వివరాలు ఇవే
Messi Goat Tour

Updated on: Dec 13, 2025 | 6:28 PM

గోట్ ఇండియా టూర్‌లో భాగంగా అర్జెంటీనా ఫుడ్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ మెస్సీకి ఘన స్వాగతం పలికారు సీఎం రేవంత్ రెడ్డి, అధికారులు.. భారీ భద్రత నడుమ ఆయన్ను ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. అయితే అక్కడ మెస్సీతో మీట్‌ అండ్‌ గ్రీట్‌ ఫోటో సెషన్ ఏర్పాటు చేసి నిర్వాహకులు మెస్సీని కలిసేందుకు 250 మందికి అనుమతి ఇచ్చారు. ఆయనతో ఫోటో దిగాలనుకున్న వారు ఈ సెషల్‌లో పాల్గొననున్నారు. ఇక్కడి నుంచి రాత్రి 7.50 గంటలకు ఉప్పల్‌ స్టేడియానికి మెస్సీ వెళ్లనున్నారు.

రాత్రి 7.50 గంటలకు ఉప్పల్ స్టేడియంలో మెస్సీ గోట్ ఫుడ్‌బాల్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. 8.06 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, మెస్సి మైదానంలోకి దిగనున్నారు. ఇక 8.15కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా అక్కడికి చేరుకొనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ,మెస్సీ మధ్య జరగనున్న 15 నిమిషాల మ్యాచ్‌ను ఆయన వీక్షించనున్నారు.

ఇదిలా ఉండగా మెస్సీ పర్యటన నేపథ్యంలో భారీ ఫ్యాన్స్ వచ్చే అవకాశం ఉండడంతో నగరంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్ చేశారు. దీంతో పాటు కోల్‌కతాలో తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. కేవలం పాసులు ఉన్న వారికి మాత్రమే స్టేడియం సమీపంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన తిరిగి వెళ్లే వరకు ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.