‘ఆపరేషన్‌ చిరుత’.. వన్యమృగం ఎక్కడికి వెళ్లిందంటే..!

| Edited By:

May 15, 2020 | 7:32 PM

హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చిరుత ముగిసింది. ఎంత వెతికినా చిరుత జాడను అధికారులు గుర్తించలేకపోయారు. గురువారం ఉదయం నుంచి రోడ్లపై తిరుగుతూ హైదరాబాద్ వాసులను గడగడలాడించిన

ఆపరేషన్‌ చిరుత.. వన్యమృగం ఎక్కడికి వెళ్లిందంటే..!
Follow us on

హైదరాబాద్‌లో ఆపరేషన్‌ చిరుత ముగిసింది. ఎంత వెతికినా చిరుత జాడను అధికారులు గుర్తించలేకపోయారు. గురువారం ఉదయం నుంచి రోడ్లపై తిరుగుతూ హైదరాబాద్ వాసులను గడగడలాడించిన చిరుత ఎక్కడికి వెళ్లిందన్న దానిపై అధికారులు శతవిధాల ప్రయత్నించారు. ఉదయం ఫామ్‌హౌస్‌ నుంచి తప్పించుకున్న చిరుత.. అగ్రికల్చర్ యూనివర్సిటీలోని అటవీ ప్రాంతంవైపు వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. ట్రాకర్ డాగ్ ద్వారా రాజేంద్ర నగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉన్న అటవీ ప్రాంతంలో కి చిరుత వెళ్లినట్టు నిర్దారణకు వచ్చిన అటవీశాఖ అధికారులు, పోలీసులు వచ్చారు. అయితే దీనిపై పూర్తి స్పష్టతను తెలుసుకునేందుకు ఇవాళ రాత్రి నైట్ విజన్ కెమెరాలతో అధికారులు ఆపరేషన్ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్‌ ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. వందల ఎకరాల్లో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది కాబట్టి చిరుతను పట్టుకోవడం కష్టమని అటవీశాఖ అధికారులు అంటున్నారు. జనారణ్యంలోకి చిరుత వస్తే ఇబ్బంది తప్ప అడవికిలో ఉంటే ఎటువంటి ఇబ్బంది ఉండదని, ఎవరు భయాందోళన చెందవద్దని చెబుతున్న అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

కాగా గురువారం తెల్లవారుజామున మైలార్‌దేవుపల్లి గగన్‌పహాడ్ రైల్వే గేటు సమీపంలోని అండవర్‌ పాస్‌వే సమీపంలో చిరుత కలకలం సృష్టించింది. ఓ వ్యక్తిని గాయపరిచి పక్కనే ఫాంహౌస్‌లోకి జారుకుంది. ఈ క్రమంలో దాన్ని పట్టుకునేందుకు మూడు అటవీశాఖ బృందాలు, జూపార్క్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. మేకలను ఎరగా వేసి రెండు బోన్లను ఏర్పాటు చేశారు. ట్రాకర్ డాగ్‌తో గస్తీ కాశారు. ఈ క్రమంలో ఫార్మ్ హౌస్ నుంచి అటవీ ప్రాంతం వరకు అర కిలోమీటర్ మేర చిరుత అడుగులు గుర్తించారు.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

 

Read This Story Also: Breaking: జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు..!