Kumari Aunty: కుమారి ఆంటీకి గుడ్ న్యూస్.. అదే ప్లేస్‌లో ఫుడ్ స్టాల్.. త్వరలో ఆమె వద్దకు సీఎం రేవంత్

ఫుట్ పాత్ పక్కన అత్యంత తక్కువ ధరకే ఫుడ్ విక్రయిస్తూ కుటుంబ పోషణ జరుపుకుంటున్నటువంటి వారిలో కుమారి ఆంటీ ఒకరు. అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా భారీ స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈమె ఫుడ్ టేస్ట్ చేయడం కోసం పెద్ద ఎత్తున తరలివచ్చారు ఫుడ్ లవర్స్. ఈ విధంగా కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ ఎంతో ఫేమస్ అయినటువంటి తరుణంలో ఒక్కసారిగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈమె ఫుడ్ బిజినెస్ క్లోజ్ చేయించారు.

Kumari Aunty: కుమారి ఆంటీకి గుడ్ న్యూస్.. అదే ప్లేస్‌లో ఫుడ్ స్టాల్.. త్వరలో ఆమె వద్దకు సీఎం రేవంత్

Updated on: Jan 31, 2024 | 1:00 PM

 హైదరాబాద్, జనవరి 31: కుమారి ఆంటీ.. ఇటీవల సోషల్‌ మీడియాలో మోత మోగిపోతున్న పేరు. హైదరాబాద్‌లోని కేబుల్‌ బ్రిడ్జి పరిసరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారం చేస్తున్న ఆమె సూపర్ ఫేమస్ అయింది. యూట్యూబ్‌ ఛానెల్స్ ఆమెను బాగా ప్రమోట్ చేశాడు. దీంతో ఫుడ్ లవర్స్ ఫోటెత్తారు. కేవలం హైదరాబాద్ వాళ్లే కాదు.. ఇతర ప్రాంతాల నుంచి సైతం ఈమె వద్ద ఫుడ్ టేస్ట్ చేసేందుకు వచ్చారు. సెలబ్రిటీలు కూడా కుమారి ఆంటీ ఫుడ్‌ తినేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.   దీంతో ఆ ప్రాంతంలో క్రౌడ్ పెరిగిపోయింది. ట్రాఫిక్ సమస్య వాటిల్లింది.  దీంతో కుమారి ఆంటీపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి..  రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని తేల్చిచెప్పేశారు. మరో ప్రాంతానికి ఫుడ్ స్టాల్ మార్చాలని డిసైడ్ చేశారు.  దీంతో ఆమె తన పొట్ట కొడుతున్నారని వాపోయింది. తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించారు. ఆమె అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ పెట్టుకునేందుకు అనుమతులు జారీ చేయాలని సూచించారు. యధావిధిగా అదే ప్లేసులోనే ఉండి వ్యాపారం చేసుకోవచ్చని తెలిపారు. ప్రజల పాలనలో.. ప్రభుత్వం వ్యాపారస్తులతో ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన ఉంటుందని.. తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు వెళ్లి ఫుడ్ ఆస్వాదించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..