Koti Fire Accident: కోఠిలో భారీ అగ్ని ప్రమాదం.. చెప్పుల గోడౌన్‌లో చెలరేగుతున్న మంటలు

Koti Fire Accident: ముందే ఎండాకాలం. అగ్ని ప్రమాదాలు భారీగానే సంభవిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్‌లోని కోఠిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది..

Koti Fire Accident: కోఠిలో భారీ అగ్ని ప్రమాదం.. చెప్పుల గోడౌన్‌లో చెలరేగుతున్న మంటలు
representative image

Updated on: Jun 06, 2022 | 11:20 PM

Koti Fire Accident: ముందే ఎండాకాలం. అగ్ని ప్రమాదాలు భారీగానే సంభవిస్తుంటాయి. తాజాగా హైదరాబాద్‌లోని కోఠిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆంధ్రాబ్యాంక్‌ సమీపంలో చెప్పుల గోడౌన్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ప్రమాదం విషయం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో వారు హుటాహుటిన రెండు ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ప్రమాదం కారణంగా కోఠి పరిసరాలు మొత్తం పొగతో నిండిపోయాయి.

మంటలు భారీగా ఎగిసి పడుతుండటంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దట్టమైన పగలు అలుముకున్నాయి. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదంలో ఎంత ఆస్తినష్టం సంభవించిందనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి