Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramoji Film City: ఒక కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేసిన రామోజీరావు.. దాని పేరే ‘రామోజీ ఫిల్మ్ సిటీ’

ఐకానిక్ లొకేషన్‌లను చూడాలనే కోరిక ప్రజల్లో పెరగడం వల్ల ఇది పెద్ద పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ల మంది పర్యాటకులు రామోజీ ఫిల్మ్ సిటీని విజిట్ చేస్తూ ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫిల్మ్ మేకర్స్ కు ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ గా కొనసాగుతోంది.

Ramoji Film City: ఒక కొత్త ప్రపంచాన్నే క్రియేట్ చేసిన రామోజీరావు.. దాని పేరే 'రామోజీ ఫిల్మ్ సిటీ'
Ramoji Film City
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 08, 2024 | 12:20 PM

ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఆరోగ్య సమస్యలతో జూన 8న పరమపదించారు. ఆయన మరణంపై దేశవ్యాప్తంగా రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అయితే రామోజీరావు.. నిర్మించిన ఫిల్మ్ సిటీ.. దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్. హైదరాబాద్‌లోని అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో 2000 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉంది. దేశ, విదేశాలకు చెందిన అనేక సినిమాలు షూటింగ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ సిటీగా(లార్జెస్ట్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫిల్మ్‌సిటీ ఇన్‌ ది వరల్డ్‌) ఇది గిన్నీస్ బుక్ రికార్డ్స్‌లోకి ఎక్కింది. తమ సెల్యులాయిడ్ కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి సంవత్సరం దాదాపు 200 ఫిల్మ్ యూనిట్లు ఇక్కడికి వస్తుంటాయి. దాదాపు అన్ని భారతీయ భాషల్లోని 2500 చిత్రాలకు పైగా ఇక్కడ షూటింగ్ చేశారు. భారతీయ సినిమా వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన బాహుబలి చిత్ర షూటింగ్ చాలావరకు ఇక్కడే జరిగింది. ఇప్పటికీ ‘బాహుబలి’ సినిమా సెట్టింగ్స్ రామోజీ ఫిల్మ్ సిటీలో అలాగే ఉన్నాయి.

రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీ రావు ఒక ప్రత్యేకమైన విజన్‌తో దిన్ని నిర్మాణం చేసి.. అందులో వివిధ విభాగాలను విస్తరిస్తూ వెళ్లారు. ఒక సినిమా ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయడానికి కావాల్సిన వనరులు అక్కడ ఉన్నాయి. ఒకే రోజులో ఏకకాలంలో 15 షూట్లు నిర్వహించే సత్తా RFCకి ఉంది.  ఎంత పెద్ద సినిమా సెట్ వేయడానికి అయినా సరిపడినంత స్థలం ఇక్కడ ఉంది. నిత్యం పదులు సంఖ్యలో సీరియల్స్ షూటింగ్స్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఇందులో రకరకాల దేశ విదేశీ శిల్పాలు, వివిధ దేశాలలోని ఉద్యానవనాల నమూనాలు, సినిమా దృశ్యాలకు కావలసిన రకరకాల ఫిక్స్డ్ సెట్స్ ఉన్నాయి.

కేవలం ఒక లొకేషన్ కోసమే మాత్రమే కాదు.. షూటింగ్‌ లొకేషన్లు, సెట్టింగ్‌లు, సాంకేతిక సామగ్రి, సదుపాయాలు అన్ని ఇక్కడ లభిస్తాయి. అందుకే పలు బాలీవుడ్, హాలివుడ్ మేకర్స్ సైతం ప్రత్యేక సందర్భాల్లో షూటింగ్స్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీని అప్రోచ్ అవుతారు. 1997లో మా నాన్నకు పెళ్లి అనే మూవీ కోసం ఫిల్మ్ సిటీలో తొలిసారి చిత్రీకరణ జరిగింది. స్టూడియోలో అడవులు, ఉద్యానవనాలు, హోటళ్లు, రైల్వే స్టేషన్, విమానాశ్రయం, అపార్ట్‌మెంట్ బ్లాక్‌లు, భవనాలు, వర్క్‌షాప్‌లు మొదలైన సెట్‌లు ఉన్నాయి. ఫిల్మ్ సిటీలో 6 హోటళ్లు, 47 సౌండ్ స్టేజ్‌లు, రైల్వే స్టేషన్‌ల నుండి దేవాలయాల వరకు పర్మనెంట్ సెట్‌లు కూడా ఉన్నాయి. హాలీవుడ్ తరహాలో స్టూడియో నిర్మించాలని భావించిన రామోజీ రావు.. ఫిల్మ్ సిటీ నిర్మాణం కోసం ఆర్ట్ డైరెక్టర్ నితీష్ రాయ్‌ సాయం తీసుకున్నారు. కాగా నిర్మాణం సమయంలో అక్కడ సేకరించిన ప్రాంతంలో ఒక్క చెట్టును, కొండను కూడా తొలగించకుండా జాగ్రత్తపడ్డారు. ఐకానిక్ లొకేషన్‌లను చూడాలనే కోరిక ప్రజల్లో పెరగడం వల్ల ఫిల్మ్ సిటీ ఆ తర్వాతి కాలంలో పెద్ద పర్యాటక ప్రాంతంగా మారిపోయింది. ప్రతి సంవత్సరం సుమారు 1.5 మిలియన్ల మంది పర్యాటకులు రామోజీ ఫిల్మ్ సిటీని విజిట్ చేస్తూ ఉంటారు. ఫిల్మ్ సిటీలో  రోలింగ్ ల్యాండ్‌స్కేప్‌లు, కాలిడోస్కోప్‌, అద్భుతమైన గార్డెన్‌లు, ఆకర్షణీయమైన లైవ్ స్టంట్ షోలు, థ్రిల్ రైడ్‌లు టూరిస్టులను ఎంతో ఆకర్షిస్తాయి.  4D వర్చువల్ రియాలిటీని పొందే అవకాశం ఉంటుంది. దేశానికే తలమానికగా నిలిచే ఫిల్మ్ స్టూడియోను రామోజీరావు తీర్చిదిద్దారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..