వైభవంగా జరిగిన సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ఎంగేజ్‌మెంట్‌

| Edited By:

Oct 19, 2020 | 1:08 PM

తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష ఓ ఇంటిది కాబోతోంది. ఆమె నిశ్చితార్థం విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో వైభవంగా జరిగింది.

వైభవంగా జరిగిన సీఎం కేసీఆర్‌ దత్తపుత్రిక ఎంగేజ్‌మెంట్‌
Follow us on

KCR Adopted Daughter: తెలంగాణ సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష ఓ ఇంటిది కాబోతోంది. ఆమె నిశ్చితార్థం విద్యానగర్‌లోని ఓ హోటల్‌లో వైభవంగా జరిగింది. రాంనగర్‌ ప్రాంతానికి చెందిన చరణ్‌ రెడ్డిని ఆమె పెళ్లాడబోతోంది.

కాగా పిన్నతల్లి చేతుల్లో తీవ్ర వేధింపులకు గురై దాదాపు చావు అంచులదాకా వెళ్లింది ప్రత్యూష. ఈ విషయం తెలుసుకున్న కేసీఆర్ ఆమెను దత్తత తీసుకున్నారు. ప్రత్యూష సంరక్షణ బాధ్యతను ఐఏఎస్ అధికారి రఘునందన్‌ రావుకు అప్పగించారు. ఆయన పర్యవేక్షణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రత్యూష యోగక్షేమాలను చూస్తూ వచ్చింది. ఇక నర్సింగ్‌ని చదివిన ప్రత్యూష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో మమత, మర్‌ రెడ్డి దంపతుల కుమారుడు చరణ్‌ రెడ్డితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రత్యూష గురించి తెలుసుకున్న చరణ్‌.. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ముందుకు వచ్చాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది.

ఇక ఈ విషయాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు చేరవేయగా.. వారు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రత్యూషను ప్రగతిభవన్‌కి పిలుపించుకొని మాట్లాడారు కేసీఆర్. ప్రత్యూషను పెళ్లి చేసుకోబోయే యువకుడి వివరాలను తెలుసుకొని సీఎం సంతోషం వ్యక్తం చేశారు. ఇక త్వరలోనే ప్రత్యూష పెళ్లి జరగనుండగా.. ఆ వివాహ వేడుకకు కేసీఆర్ తప్పకుండా వస్తారని ప్రత్యూష చెబుతోంది. కాగా చరణ్‌ రెడ్డి ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు.

Read More:

ఒప్పుకున్న చిరు.. ఊపిరి పీల్చుకున్న దర్శకుడు..!

టాలీవుడ్‌ మార్గంలో నడవండి.. కోలీవుడ్‌కి భారతీరాజా సూచన