ప్రమాదకర స్థితిలో మీర్‌పేట చెరువు… ఏ క్షణమైనా తెగిపోయే సూచనలు
భాగ్యనగరాన్ని భారీ వర్షాలు, వరదలు ఇంకా బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. మళ్లీ నేటి నుంచి భారీ వర్షాల హెచ్చరికలతో పలు కాలనీల వాసులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా హైదరాబాద్ మీర్ పేట చెరువు ప్రమాదభరితంగా మారిపోయింది. ఏ క్షణమైనా కట్టలు తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువు పక్కన ఉన్న స్మశానవాటికలో నుండి అలుగు పారుతోంది. దీంతో చెరువు కట్ట తెగకుండా ఈ ఉదయం నుంచి ముమ్మరంగా ముందస్తు చర్యలు చేపట్టారు. బస్తాలలో మట్టి నింపుతూ గట్లను బలోపేతం […]
భాగ్యనగరాన్ని భారీ వర్షాలు, వరదలు ఇంకా బెంబేలెత్తిస్తూనే ఉన్నాయి. మళ్లీ నేటి నుంచి భారీ వర్షాల హెచ్చరికలతో పలు కాలనీల వాసులకు దిక్కుతోచని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా హైదరాబాద్ మీర్ పేట చెరువు ప్రమాదభరితంగా మారిపోయింది. ఏ క్షణమైనా కట్టలు తెగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చెరువు పక్కన ఉన్న స్మశానవాటికలో నుండి అలుగు పారుతోంది. దీంతో చెరువు కట్ట తెగకుండా ఈ ఉదయం నుంచి ముమ్మరంగా ముందస్తు చర్యలు చేపట్టారు. బస్తాలలో మట్టి నింపుతూ గట్లను బలోపేతం చేస్తున్నారు. మీర్ పేట చెరువు కట్ట కింది వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇప్పటికే 60 శాతానికి పైగా జనం సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు లోతట్టు ప్రాంత వాసులు చెబుతున్నారు. వాతావరణ శాఖ మళ్లీ వర్షం సూచనలు చేయడంతో మరేముంపు ముంచుకొస్తుందోనని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.