KA Paul: ఆ ప్లాన్ నా దగ్గర ఉంది.. మామూలు రచ్చ కాదు బాబోయ్.. పాల్ @ ప్రగతి భవన్..

KA Paul @ Pragati Bhavan: తెలంగాణ పాలిటిక్స్‌లో ఫుల్ కామెడీ చేసే కేఏ పాల్ మరోసారి హల్ చల్ చేశారు. నేరుగా ప్రగతి భవన్ దగ్గరికి వచ్చిన పాల్.. అర్జెంట్‌ పనుంది సీఎం కేసీఆర్ ని కలవాలంటూ.. నానా హడావుడి చేశారు.

KA Paul: ఆ ప్లాన్ నా దగ్గర ఉంది.. మామూలు రచ్చ కాదు బాబోయ్.. పాల్ @ ప్రగతి భవన్..
Ka Paul

Edited By:

Updated on: Jul 03, 2023 | 5:48 PM

KA Paul @ Pragati Bhavan: తెలంగాణ పాలిటిక్స్‌లో ఫుల్ కామెడీ చేసే కేఏ పాల్ మరోసారి హల్ చల్ చేశారు. నేరుగా ప్రగతి భవన్ దగ్గరికి వచ్చిన పాల్.. అర్జెంట్‌ పనుంది సీఎం కేసీఆర్ ని కలవాలంటూ.. నానా హడావుడి చేశారు. అలా అపాయింట్మెంట్ లేకుండా కలవడం కుదరదు అంటూ ప్రగతి భవన్ గేటు దగ్గరే పోలీసులు ఆపివేశారు. దీంతో కారు దిగిన పాల్.. నన్నే ఆపుతారా ..? అంటూ పోలీసులపై చిందులేసారు. రాష్ట్ర అప్పులను తీర్చే ప్లాన్ నా దగ్గర ఉంది, రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చాలా విషయాలు అర్జెంటుగా చర్చించాలి అంటూ లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, పోలీసులు పాపం పాల్ ను గేటు లోపలకు కూడా వెళ్ళనివ్వలేదు..

తనను గేటు దగ్గర ఇక్కడ ఆపడం వల్ల లక్షల కోట్లు ఈ రాష్ట్రం నష్టపోతుందంటూ.. కేఏ పాల్‌ మొత్తుకున్నప్పటికీ.. పోలీసులు మాత్రం అస్సలు వినలేదు. అయినప్పటికీ.. కేఏ పాల్‌ మాత్రం.. వెనక్కితగ్గలేదు.. తన పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు నాకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటారు అంటూ ఇంకాసేపు అక్కడే ఉండే ప్రయత్నం చేశారు.

చివరకు పోలీసులు కేఏ పాల్‌ను బలవంతంగా కారెక్కించి అక్కడ నుంచి పంపించేశారు. అఖిలేష్ యాదవ్ లాంటి ఇతర రాష్ట్రాల నేతలకు అపాయింట్మెంట్ ఇస్తారు.. కానీ ఈ రాష్ట్రానికి చెందిన ఒక పార్టీ అధ్యక్షునికి అపాయింట్మెంట్ ఇవ్వరా అంటూ కేఏ పాల్‌ నిరాశతో వెళ్లిపోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..