
పోలింగ్‌కు వేళాయె. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ స్టేషన్లు రెడీ అయ్యాయి. పోలింగ్ సిబ్బంది EVM మిషన్లతో పోలింగ్ బూత్‌లకు తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. 407 పోలింగ్ కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి అన్ని డివిజన్లకు పోలింగ్ మెటీరియల్ చేరుకుంది. 5 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. గొడవలకు, దొంగ ఓట్లకు తావులేకుండా నిఘా పెట్టారు అధికారులు. డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటిరింగ్ చేస్తున్నారు. EVMలు మొరాయిస్తే బ్యాకప్ కూడా ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. శాంతిభద్రతల పరంగా 65 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించారమన్నారు పోఈలసులు. ఆయా ఏరియాల్లో రౌడీషీటర్లను బైండోవర్ చేశారు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు పోలీసులు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది -మహేష్ గౌడ్
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు ప్రజలు నిలిచారు
సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించారు
కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు
అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంలో సఫలమయ్యాం -మహేష్‌గౌడ్
యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర టెన్షన్
BRS, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం
BRS నేతలు మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి తరలింపు
దొంగ ఓట్లు వేయిస్తున్నారని BRS ఆందోళన
అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు
BRS నిరసనపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
అనుచరులతో కలిసి రోడ్డుపైకి వచ్చిన చిన్న శ్రీశైలం యాదవ్
రెండు వర్గాల ఆందోళనతో భారీగా పోలీసుల మోహరింపు
BRS, కాంగ్రెస్ నేతలను చెదరగొట్టిన పోలీసులు
ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలెంజ్‌గా తీసుకున్నప్పటికీ.. పోలింగ్ శాతంలో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. ఉదయం నుంచి మందకొడిగానే కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఎన్నికల సంఘం అవగాహన కల్పించినా ఓటర్లు ఇళ్ల నుంచి కదలడం లేదు. బస్తీల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ స్లోగానే నడుస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్‌కు మరో గంట మాత్రమే సమయం మిగిలి ఉంది. ఆరు గంటల్లోపు క్యూలైన్‌లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదు అయింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని మహిళ సమాజం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్
MIM MLA కౌసర్ మొహినుద్దీన్ దగ్గరుండి కాంగ్రెస్‌కి అనుకూలంగా రిగ్గింగ్‌కి ప్లాన్ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ
బూత్ నెంబర్స్ 66,67లో ప్రిసైడింగ్ అధికారులను బెదిరించి, BRS ఏజెంట్‌ని మొహినుద్దీన్ బలవంతంగా బయటకుపంపారన్న బీఆర్ఎస్
ఐడీ కార్డులు లేకుండానే ఓట్లు వేయిస్తున్నారన్న BRS
సాయంత్రం 4తర్వాత పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి ప్లాన్ చేశారని చెబుతున్న బీఆర్ఎస్
వీడియోలు తీస్తున్నవాళ్ల ఫోన్లు కూడా లాక్కున్న MIM స్థానిక నేతలు
పారామౌంట్ కాలనీ, అజీజ్‌బాగ్, సమతాకాలనీల్లో సేమ్ సీన్ అంటున్న BRS
జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై నిషేధం ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం అందరు నడుచుకోవాలని ఈసీ సూచించింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించేది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులు అయిన నియోజకవర్గం కానీ నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.
పోలింగ్ బూత్ నెంబర్ 67 లో మరో ఫేక్ ఓటర్
మహిళా ఓటర్ తన ఓటు వేసేందుకు రాగా.. అప్పటికే తన ఓటు వేరే వాళ్ళు వేశారని ఆవేదన
పోలింగ్ అధికారులు సమాధానం చెప్పడం లేదని వాపోయినా మహిళా ఓటర్ భర్త
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. అయితే ఓ వృద్ధురాలు వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె, అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క అన్నారు. కష్టమయిన సరే వచ్చి ఓటు వేయాలని కోరారు. నడవలేకున్నా అయినా సరే వచ్చి ఓటు వేస్తున్నానని, యువకులు ఇళ్ల నుండి వచ్చి ఓటు వేయాలని సూచించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫస్ట్ టైమ్ ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్.వి కర్ణన్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రతీ ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్ణన్ సూచించారు.
మధురానగర్‌లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్ పోలింగ్‌బూత్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటేశారు. కుటుంబంతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మందకొడిగా ఓటింగ్ సాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉదయాన్నే ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. అక్కడే ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్‌గూడలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆరా తీశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి షేక్‌పేటలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. ఓటింగ్ సరళిని పరిశీలించారు.
ఎర్రకోట కారు పేలుడు ఘటన కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
బదర్‌పూర్ సరిహద్దు ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుండి కాశ్మీరీ గేట్- ఎర్రకోట వరకు ఉన్న మార్గంలోని అనేక CCTV కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు
అనేక మార్గాల్లో CCTV ఫుటేజ్‌లను పరిశీలించిన దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది
వివిధ ప్రదేశాల నుండి వచ్చిన CCTV ఫుటేజ్ ఆధారంగా, సుమారు 13 మందిని అనుమానితులుగా ప్రశ్నిస్తున్న పోలీసులు
ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న డాక్టర్ ఉమర్ I20లో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు
పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కర్ణన్ తెలిపారు. 11 ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య తలెత్తగా.. రిజర్వ్ ఈవీఎంలను రీప్లేస్ చేశామన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కర్ణన్ పిలుపునిచ్చారు.
శ్రీనగర్ కాలనీలో పోలింగ్ నిలిచిపోయింది. నాగార్జున కమ్యూనిటీ కాలనీలో పవర్ కట్ అయ్యింది. దీంతో ఓటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
షేక్‌పేట డివిజన్‌లో ఈవీఎం మొరాయించింది. పోలింగ్ బూత్ 30లోని ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రహమత్ నగర్ డివిజన్‌లోని 165, 166 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవోదయ కాలనీ పోలింగ్ బూత్‌లో ఆమె తన పిల్లలతో కలిసి ఓటు వేశారు.
జూబ్లీహిల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. దాదాపు 5,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 1,761 మంది హైదరాబాద్ సిటీ పోలీస్ బలగాలతో పాటు, అదనంగా 800 మంది కేంద్ర పోలీస్ బలగాలను రంగంలోకి దించారు.
— ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ
— 4లక్షల 1365మంది ఓటర్లు.. 407 పోలింగ్ కేంద్రాలు
— 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు..
— వెబ్‌కాస్టింగ్.. డ్రోన్లతో నిఘా.. పారామిలిటరీతో బందోబస్తు
గొడవలకు, దొంగ ఓట్లకు తావులేకుండా నిఘా పెట్టారు అధికారులు. డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటిరింగ్ చేస్తున్నారు. EVMలు మొరాయిస్తే బ్యాకప్ కూడా ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారులు
యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుంచి అన్ని డివిజన్లకు పోలింగ్ మెటీరియల్ చేరుకుంది. 5 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్.
— 139 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్
— పోలింగ్ ముగిసేవరకు వైన్స్ బంద్
— 407 పోలింగ్ కేంద్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.
— ఓటింగ్‌కి వేళయ్యింది. మరికాసేపట్లోనే జూబ్లీహిల్స్ ఓట్ల జాతర మొదలుకానుంది.
— వేలాదిమంది సిబ్బందితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కి సర్వంసిద్ధమైంది
— ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్
— జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58మంది అభ్యర్థులు