AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: లక్ష డిపాజిట్ చేస్తే రూ.10వేలు వడ్డీ.. అత్యాశకు పోయి ఉన్నదంతా ఇచ్చారు.. కట్ చేస్తే..

భాగ్యనగరంలో భారీ మోసం వెలుగు చూసింది. స్టాక్‌మార్కెట్లో పెట్టుబడుల పేరుతో ఓ సంస్థ 150 కోట్ల మేర శఠగోపం పెట్టింది. వందల సంఖ్యలో బాధితులను రోడ్డున పడేసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Hyderabad: లక్ష డిపాజిట్ చేస్తే రూ.10వేలు వడ్డీ.. అత్యాశకు పోయి ఉన్నదంతా ఇచ్చారు.. కట్ చేస్తే..
Indian Money
Shaik Madar Saheb
|

Updated on: May 31, 2025 | 7:38 AM

Share

హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని చింతల్‌ గణేశ్‌నగర్‌లో భారీ మోసం వెలుగుచేసింది. భారీ లాభాల పేరుతో ‘ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌’ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసిన బాలాజీ, శ్వేత అనే ఇద్దరు వ్యక్తులు నయవంచనకు పాల్పడ్డారు. పలువురిని నమ్మించి.. దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూలు చేశారు. లక్ష నుంచి రూ.కోటి వరకు బాండ్ల రూపంలో సుమారు1,500 మందితో ‘ది పెంగ్విన్‌ సెక్యూరిటీస్‌ సంస్ధలో పెట్టుబడులు పెట్టించారు. లక్ష డిపాజిట్ చేస్తే ప్రతి నెల 10 వేల రూపాయల చొప్పున 20 నెలలు కస్టమర్ కు పెంగ్విన్ కంపెనీ చెల్లిస్తుందని నమ్మించారు. దీంతో అధిక వడ్డీ వస్తుందని అందరూ సంతోషపడ్డారు..

దీంతో కంపెనీ పేరిట బాండ్‌ల రూపంలో 1500 మంది పెద్ద మొత్తంలో డిపాజిట్ చేసారు. 5 నెలలు సక్రమంగా నగదు చెల్లించి.. ఆ తర్వాత కంపెనీ బోర్డు తిప్పేసి తప్పించుకొని తిరుగుతున్నారు. తాజాగా సంస్థ కార్యాలయంలో కస్టమర్లు కొందరిని నిలదీయడంతో నిర్వాహకులు చేతులెత్తేసారు.

తాము మోసపోయామని గ్రహించిన బాధితులు పెద్దసంఖ్యలో పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అధిక వడ్డీకి ఆశపడి నిట్టనిలువునా మోసపోయామంటూ బాధితులు లబోదిబోమంటున్నారు.

లాభాల పేరుతో నయవంచనకు పాల్పడిన ఫేక్‌ కంపెనీపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..