Festival Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండుగల సీజన్‌లో మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి

|

Oct 29, 2021 | 2:33 PM

Indian Railways: పండుగ సీజన్‌లో ప్రయాణీకులకు ఊరట కలిగిస్తూ రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

Festival Special Trains: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండుగల సీజన్‌లో మరిన్ని ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలు తెలుసుకోండి
Sankranti Special Train
Follow us on

Indian Railways: పండుగ సీజన్‌లో ప్రయాణీకులకు ఊరట కలిగిస్తూ రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా పలు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ ప్రత్యేక రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రయాణీకులు enquiry.indianrail.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ చేసి తెలుసుకోవచ్చు. రైల్వే రిజర్వేషన్ సెంటర్లతో పాటు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ ప్రత్యేక రైళ్లలో ప్రయాణానికి టికెట్స్ బుకింగ్ చేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే ప్రత్యేక రైళ్లకు సంబంధించిన వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

ఇందులో భాగంగా హైదరాబాద్ – గోరఖ్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనుంది. ప్రత్యేక రైలు (నెం.02575) హైదరాబాద్ నుంచి నవంబరు 5న(శుక్రవారం) రాత్రి 9.05 గం.లకు బయలుదేరి ఆదివారంనాడు ఉదయం 6.30 గం.లకు గోరఖ్‌పూర్ చేరుకుంటుంది. అలాగే మరో ప్రత్యేక రైలు (నెం.02576) గోరఖ్‌పూర్‌ నుంచి నవంబరు 7న(ఆదివారం) ఉదయం 8.30 గం.లకు బయలుదేరి సోమవారంనాడు మధ్యాహ్నం 03.20 గం.లకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. పూర్తిగా రిజర్వేషన్ చేసిన ప్రయాణీకులు మాత్రం ఈ రైళ్లను ఎక్కేందుకు వీలుంటుంది.

అలాగే వాస్కోడా గామా – జాసిది మధ్య రైల్వే శాఖ ప్రత్యేక వీక్లీ రైళ్లను నడపనుంది. వాస్కోడా గామా నుంచి జసిదికి నవంబరు 5 నుంచి జనవరి 28 వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ఈ ప్రత్యేక రైలు(నెం.06397) వస్కోడా గామాలో ప్రతి శుక్రవారం ఉదయం 05.15 గం.లకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07 గం.లకు జసిదికి చేరుకుంటుంది. అలాగే జసిది నుంచి వాస్కోడా గామాకు నవంబరు 8 నుంచి జనవరి 31 వరకు వీక్లీ ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. ప్రతి సోమవారం 1.10 గం.లకు జసిదిలో బయలుదేరనున్న ప్రత్యేక రైలు.. మరుసటి రోజు మధ్యాహ్నం 2.40 గం.లకు వాస్కోడా గామాకు చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు మార్గాల్లోనూ మడ్గావ్‌, క్యాస్టిల్‌ రాక్‌, లోండా, ధార్వాడ్‌, హుబ్లీ, గదగ్‌, కొప్పల్‌, హాస్పేట, తోరణగల్లు, బళ్లారి, గుంతకల్లు, రా యచూరు, వికారాబాద్‌, సికింద్రాబాద్‌, ఖాజీపేట్‌, మం చిర్యాల, బాలార్ష, రాయ్‌పూర్‌, బిలాస్పూర్‌, రూర్కెలా, హతియా, రాంచీ, చంద్రాపూర్‌, ధనబాద్‌, చిత్తరంజన, మధుపూర్‌ రైల్వే స్టేషన్లలో ఆగుతాయి.

కొన్ని రైళ్లు రద్దు.. గమ్య స్థానాల్లో మార్పు..

అలాగే మరికొన్ని రైళ్లను రద్దు చేయగా.. కొన్ని రైళ్లు బయలుదేరే రైల్వే స్టేషన్లు.. గమ్య స్థానాల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. ఆ వివరాలను కూడా ట్విట్టర్ ద్వారా దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన రైల్వే ప్రయాణీకులు తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలి.

దేశంలో మొత్తం 668 ఫెస్టివల్ స్పెషల్ సర్వీసులు..

పండుగల సీజన్ నేపథ్యంలో భారత రైల్వే శాఖ 110 రైళ్లతో మొత్తం 668 ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నట్లు రెండ్రోజుల క్రితం రైల్వే శాఖ వెల్లడించింది. దేశంలోని ప్రధాన నగరాల మీదుగా ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ప్రయాణీకుల రద్దీ నేపథ్యంలో ఈ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.

Also Read..

Indian Railways: IRCTCకి పెను ఊరట.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోనున్న రైల్వే శాఖ

Ganja Seized: భాగ్యనగరంలో 110 కిలోల గంజాయి పట్టివేత.. ఏవోబీ నుంచి అరటి లోడ్‌లో తరలిస్తుండగా..