Indian Railway: రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?

భారతదేశంలో సామాన్య, మధ్యతరగతి నుంచి అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం రైల్వే ప్రయాణం. ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకుని తమ తమ దైనందిన జీవితాలను గడుపుతుంటారు. అయితే వారందరీ ఓ విజ్ఞప్తి.. ఇవాళ్టి నుంచి కొత్త రైలు చార్జీలు అమలులోకి వచ్చాయి.

Indian Railway: రైల్వే ప్రయాణీకులకు అటెన్షన్.! భారీగా పెరిగిన ఛార్జీలు అమలులోకి.. ఎంతంటే.?
Railway Charges Hike

Updated on: Dec 26, 2025 | 8:23 AM

దేశవ్యాప్తంగా రైల్వే ఛార్జీలన్నీ పెరిగాయి. ఇవాళ్టి నుంచి కొత్త రైల్వే ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఈ ఛార్జీల పెంపుతో ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు కల్లా అంటే 2026 మార్చి 31 కల్లా రూ.600 కోట్లు అదనంగా సంపాదించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో రైల్వే ఛార్జీల పెంపునకు ప్రయాణికులు సిద్దం కావాల్సిందే. రైళ్లలో జనరల్ టికెట్లకు 215 కి.మీ కంటే ఎక్కువ దూరం ప్రయాణించేవారికి కిలోమీటరుకు 1 పైసా అదనపు ఛార్జీ విధిస్తున్నారు. 216 కి.మీ నుంచి 750 కి.మీ వరకు రూ. 5 మేరకు పెరగనుండగా.. 751 కి.మీ నుంచి 1250 కి.మీ మధ్య దూరానికి రూ. 10, 1251 కి.మీ నుంచి 1750 కి.మీ మధ్య దూరానికి రూ. 15, 1751 కి.మీ నుంచి 2250 కి.మీ మధ్య దూరానికి రూ. 20 మేరకు పెరగనుంది.

అయితే మెయిల్, ఎక్స్‌ప్రెస్ సర్వీసులకు నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటరుకు 2 పైసల పెరుగుదల ఉంటుంది. ఈ లెక్కన చూస్తే 500 కి.మీ నాన్-ఏసీ ట్రిప్‌కు అదనంగా రూ.10 ఖర్చవుతుంది. 215 కి.మీ కంటే తక్కువ దూరం ప్రయాణించే మార్గాలకు ఛార్జీలు పెరగట్లేదు. పేద, మధ్యతరగతి ఆదాయ వర్గాలకు కూడా ఇందులో ఊరట లభించనుంది. ప్రతీ నెలా వారు తీసుకునే సీజనల్ సబర్బన్ , నెలవారీ టిక్కెట్లకు ఛార్జీల పెంపు వర్తించదు. పదేళ్లుగా రైల్వేలు తమ నెట్‌వర్క్ పెంచుకోవడం, మారుమూల ప్రాంతాలకు సైతం విస్తరింస్తోంది.

దీనికి మరింత ప్రోత్సాహం ఇచ్చేలా ఈ టికెట్ రేట్లు పెంచుతున్నట్లు రైల్వేశాఖ చెబుతోంది. ఇక ఈ సంవత్సరంలో రైలు చార్జీలు పెరగడం ఇది రెండోసారి. గతంలో జూలై నెలలో ఒకసారి పెరిగిన సంగతి తెలిసిందే. కాగా, పెరిగిన ధరలు తేజస్ రాజధాని, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్‌సఫర్, అమృత్ భారత్, తేజస్, మహామాన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, జన శతాబ్ది, యువ ఎక్స్‌ప్రెస్, నమో భారత్ ర్యాపిడ్ రైల్ లాంటి ప్రధాన రైలు సర్వీసులకు వర్తిస్తాయని రైల్వే శాఖ పేర్కొంది. డిసెంబర్ 26న లేదా ఆపై టికెట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే సవరించిన చార్జీలు వర్తించనున్నాయి. ముందు బుక్ చేసుకున్న టికెట్లకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టం చేసింది. 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి