PV Sindhu: గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ హాజరు

|

Dec 24, 2024 | 11:11 PM

PV Sindhu Marriage Reception: రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ స్టార్ హోటల్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహ వేడుక గత ఆదివారంనాడు జరిగగా.. ఇవాళ (మంగళవారం) హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు నవదంపతులను ఆశీర్వదించారు.

PV Sindhu: గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ హాజరు
Pv Sindhu Marriage Reception
Follow us on

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా నవ వధూవరులను ఆశీర్వదించారు.

ఆదివారంనాడు రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో పీవీ సింధు – వ్యాపారవేత్త వెంకట్ దత్త సాయిల వివాహ వేడుక ఘనంగా జరగడం తెలిసిందే. తమ బంధువులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పీవీ సింధును పెళ్లి చేసుకున్న వెంకట్ దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్నారు.

Hero Ajith and Shalini in Pv Sindhu Marriage Reception

RK Roja in PV Sindhu Marriage Reception

కాగా మంగళవారంనాడు తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను పీవీ సింధు సోషల్ మీడియాలో షేర్ చేశారు.