CCMB Study: షాకింగ్‌ న్యూస్‌.. భారత్‌లో 7,569 కరోనా వైరస్‌ రకాలు.. సీసీఎంబీ పరిశోధనలలో వెల్లడి

|

Feb 20, 2021 | 8:43 PM

CCMB Study: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాప్తించి అల్లకల్లోలం చేసింది. కోట్లాది మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ వైరస్ లక్షలాది..

CCMB Study: షాకింగ్‌ న్యూస్‌.. భారత్‌లో 7,569 కరోనా వైరస్‌ రకాలు.. సీసీఎంబీ పరిశోధనలలో వెల్లడి
Follow us on

CCMB Study: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా చాపకింద నీరులా వ్యాప్తించి అల్లకల్లోలం చేసింది. కోట్లాది మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసిన ఈ వైరస్ లక్షలాదిమందిని బలితీసుకుంది. ఈ వైరస్‌ దేశాల ఆర్థిక స్థితిగతులను మార్చేసింది. ఇంకో విషయం ఏంటంటే ఇటీవల కాలంలో వెలుగు చూసిన వైరస్‌లలో వేలాది రకాలు ఉన్న ఒకే ఒక్క అంటుజీవి ఇదే.

ఈ వైరస్‌ వెలుగు చూసిన తర్వాత ఒక్క భారత్‌లో ఉకంగా 7,569 కరోనా వైరస్‌ వేరియంట్లను గుర్తించారు. దేశంలో శాస్త్రవేత్తలు తగినన్ని నమూనాలను క్రమం చేయనప్పటికీ అన్ని రకాలు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తల బృందం రీసెర్చ్‌ పబ్లికేషన్‌ ప్రకారం.. దేశంలో 7,569 కరోనా రకాలు ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నాయి.

సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఒక్కరే 5 వేల కరోనా రకాలను, అవి ఎలా ఉద్భవించాయన్న దానిని విశ్లేషించారు. కోవిడ్‌ వైరస్‌ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా తీవ్రంగా విజృంభించినప్పటికీ మన దేశంలో తక్కువే. ఇక ఈ వేరియంట్లలో రోగ నిరోధకత నుంచి తప్పించుకునే E484K మ్యుటేషన్, N501Y మ్యుటేషన్ల వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేష్‌ మిశ్రా తెలిపారు. వీటిలో కొన్ని రకాలు కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Also Read: Covid-19 Case: తెలంగాణలో మళ్లీ కలకలం రేపుతున్న కరోనా కేసులు.. అంత్యక్రియలకు వెళ్లిన వారికి 33 మందికి కరోనా