IT Raids on Excel Group of Companies: హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు కలకలం రేపాయి. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌పై ఏక కాలంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలోని ఎక్సెల్ గ్రూప్ కార్యాలయానికి బుధవారం ఉదయాన్నే చేరుకున్న ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా 18 చోట్ల ఏకకాలంలో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్సెల్ కంపెనీ కార్యకలాపాలు చెన్నై కేంద్రంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం ఉదయం నుంచే దేశవ్యాప్తంగా ఏకకాలంలో 18 చోట్ల దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కంపెనీకి సంబంధించిన అన్ని కార్యకలాపాలు, గతంలో లావాదేవీలు తదితర వివరాలను ఐటీ అధికారులు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఎక్సెల్ కార్యాలయానికి భారీగా చేరుకున్న సిబ్బంది.. సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇన్‌కమ్ టాక్స్‌కు సంబంధించి అవకతవకలు జరిగినట్లు సమాచారం.. దీంతోనే ఐటీ దాడులు జరుగుతున్నాయని తెలుస్తోంది.
కాగా.. హైదరాబాద్‌లో ఇటీవలనే.. ఓ మంత్రి, పలువురు పారిశ్రామికవేత్తల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా ఐటీ దాడుల వార్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు, రాజకీయ నాయకుల్లో టెన్షన్ నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..