పేపర్ లెస్ పోలీస్.. దేశంలోనే తెలంగాణ పోలీసులు భేష్.. మరోసారి మార్క్ దిశగా..

ఒక్క హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఇప్పటికే 500 డాంగిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.ఈ ఆఫీస్ లో ప్రతీ పోలీస్ అధికారి సంతకాని డిజిటలైజ్ చేస్తారు. అధికారుల క్యాడర్ల బట్టి ఫిర్యాదులు, విన్నపాలు అన్నింటిని ఆన్ లైన్ లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఆఫీస్ విధానాన్నే క్షేత్ర‌స్థాయిలో రాష్ట్ర‌పోలీసులు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

పేపర్ లెస్ పోలీస్.. దేశంలోనే తెలంగాణ పోలీసులు భేష్.. మరోసారి మార్క్ దిశగా..
Telangana Police

Edited By: Ravi Kiran

Updated on: Oct 21, 2023 | 9:41 PM

టెక్నాలజీని వినియోగిస్తూ… దేశంలోనే తెలంగాణ పోలీసులు భేష్ అనిపించుకున్నారు. ఇప్పుడు మరోసారి తమ మార్క్ చూపించుకునే విధంగా పేపర్ లెస్ పాలన దిశగా అడుగులు వేస్తున్నారు పోలీసులు. ఈ ఆఫీస్ విధానం అమలుతో…కమీషనరేట్ పరిధిలో అధికారిక వ్యవహారలన్నిఆన్ లైన్ లోనే జరిగే విధంగా చర్యలు తీసుకొనున్నారు. కేసుల విచారణ, దర్యాప్తు, పరిపాలన మొత్తం ఆన్ లైన్ లో చేయాలని నిర్ణయం తీసుకున్నారు పోలీసులు ఉన్నత అధికారులు.

ఈ-ఆఫీస్ విధానంతో ఫిర్యాదులు, విచారణలు, దర్యాప్తులు అన్నీ కూడా ఆన్ లైన్ లో జరుగుతాయి. గతంలో రాతపూర్వకంగానే అన్ని వ్యవహారాలు జరిగేవి. దాంతో కొంత వరకు ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అత్యాధునిక పరిజ్ఙానంతో ఈ విధానాని శ్రీకారం చుట్టనున్నారు తెలంగాణ పోలీసులు.

ఈ ఆఫీస్ సిస్టం లో ప్రతీ పోలీస్ అధికారికి లాగిన్ ఐడీ ఇస్తారు… దానితో వారు లాగిన్ అయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ నుండైనా ఈ- ఆఫీస్ యాక్సిస్ చేసే విధంగా అధికారులకు డాంగిల్స్ సైతం అంద‌జేశారు. ఒక్క హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో ఇప్పటికే 500 డాంగిల్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.ఈ ఆఫీస్ లో ప్రతీ పోలీస్ అధికారి సంతకాని డిజిటలైజ్ చేస్తారు. అధికారుల క్యాడర్ల బట్టి ఫిర్యాదులు, విన్నపాలు అన్నింటిని ఆన్ లైన్ లో పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కూడా ఈ ఆఫీస్ విధానాన్నే క్షేత్ర‌స్థాయిలో రాష్ట్ర‌పోలీసులు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..