TSRTC: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే రూ. 500 చెల్లించాల్సిందే.!

|

Dec 17, 2023 | 5:42 PM

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఐడీ కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని.. లేదంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐడీ కార్డు చూపిస్తేనే..

TSRTC: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. అలా చేస్తే రూ. 500 చెల్లించాల్సిందే.!
Tsrtc Free Bus
Follow us on

మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణంపై టీఎస్‌ఆర్టీసీ కీలక ప్రకటన చేసింది. ఐడీ కార్డు ఉంటేనే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అని.. లేదంటే ఛార్జీలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది. ఐడీ కార్డు చూపిస్తేనే.. జీరో టికెట్ జారీ చేస్తామన్నారు. లేదంటే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సిందేనని.. తీసుకోకుంటే రూ. 500 ఫైన్ వేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలులోకి తీసుకొచ్చింది ‘మహాలక్ష్మీ’ పథకం. ఈ స్కీం ద్వారా రాష్ట్ర మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో తెలంగాణలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించింది కాంగ్రెస్ సర్కార్. ఈ పధకాన్ని సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ 9న ప్రారంభించగా.. తొలి వారం పాటు ఎలాంటి కార్డు లేకుండా ఫ్రీగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. ఆ తర్వాత మహిళలకు శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేసింది టీఎస్ఆర్టీసీ. ఐడీ కార్డు తప్పనిసరి చేసింది. శనివారం నుంచి కార్డు చూపించకపోతే.. చర్యలు తీసుకుంటామని తెలిపింది. స్థానికత ధ్రువీకరణ కోసం ఆధార్‌, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు లాంటి గుర్తింపు కార్డుల్లో ఏదొకటి కండక్టర్‌కు చూపించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కోరారు. కార్డు చూపిస్తేనే కండక్టర్ జీరో టికెట్ జారీ చేస్తారని పేర్కొన్నారు.