Hyderabad: తాగి రోడెక్కారో తప్పించుకోలేరు.. దొరికితే రూ. 10 వేలు ఫైన్, 6 నెలల జైలు

|

Dec 31, 2024 | 11:13 AM

తెలంగాణలో పోలీసుల నిఘా నీడలో న్యూ ఇయర్ వేడుకలు జరగబోతున్నాయి. సెలబ్రేషన్స్‌పై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. పోలీసులు. ఇప్పటికే ప్రత్యేక టీంతో నిఘాపెట్టి పలు చోట్ల డ్రగ్స్ సీజ్ చేశారు. ఎనీటైం.. ఎనీవేర్‌ రెయిడ్స్ జరగొచ్చంటూ వార్నింగ్ పాస్ చేశారు.

Hyderabad: తాగి రోడెక్కారో తప్పించుకోలేరు.. దొరికితే రూ. 10 వేలు ఫైన్, 6 నెలల జైలు
Follow us on

మందుబాబులకు తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. డిసెంబర్ 31 రాత్రి 8 నుంచి జనవరి 1 ఉదయం 7 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, డ్రగ్ డిటెక్షన్ టెస్టులు చేయనున్నట్టు తెలిపారు. మద్యం తాగి తొలిసారి పట్టుబడితే రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష విధించనున్నారు. రెండోసారి పట్టుబడితే రూ. 15 వేల జరిమానా, జైలు శిక్ష, 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేయనున్నారు. అలాగే డ్రగ్స్ సేవించి దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు కూడా నమోదు చేస్తారు. అటు కొత్త సంవత్సర వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు హైదరాబాద్‌ పోలీసులు. జూబ్లీహిల్స్‌లో 30పబ్‌లలో మాత్రమే న్యూఇయర్ వేడుకలకు అనుమతి ఇచ్చారు. 4 పబ్‌లలో వేడుకలకు అనుమతి నిరాకరించారు. గతంలో జరిగిన గొడవల కారణంగా ఆ పబ్‌లలో వేడుకలకు నో చెప్పారు. అనుమతి ఇచ్చిన పబ్‌లలో కూడా అర్ధరాత్రి ఒంటిగంటలోపు వేడుకలు ముగించాలని ఆదేశించారు పోలీసులు. పార్కింగ్ నిర్వహణ ఈవెంట్ నిర్వాహకులదేనని ఇప్పటికే స్పష్టం చేశారు. న్యూ ఇయర్ పార్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని నార్కొటిక్‌ బ్యూరో అధికారులు హెచ్చరించారు.

న్యూఇయర్ సెలబ్రేషన్స్ నేపథ్యంలో మద్యం దుకాణాలకు ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. మద్యం దుకాణాలను అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉండొచ్చని పేర్కొంది. ఇక బార్లు, రెస్టారెంట్లు అర్థరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఒక్కరోజే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల లిక్కర్‌ సెల్స్‌ జరిగే ఛాన్స్ ఉందని ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక గత మూడు రోజుల్లో దాదాపు రూ. 565 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2వేల 620 మద్యం దుకాణాలు ఉండగా..19 మద్యం డిపోల ద్వారా ప్రభుత్వం లిక్కర్ సరఫరా చేస్తోంది. న్యూఇయర్ సందర్భంగా మెట్రోరైలు వేళలు పొడిగించారు. ఈ అర్థరాత్రి 12:30 వరకు మెట్రోరైలు సర్వీసులు తిరుగుతాయని వెల్లడించారు అధికారులు. న్యూఇయర్ వేడుకల సందర్భంగా తెలంగాణ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 రాత్రి ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి