Hyderabad Trafic: హైదరాబాదీలకు అలర్ట్.. ఆ రూట్‌కు వెళ్లారంటే ఇక తిరుగుతూనే ఉండాలి..

|

Dec 22, 2022 | 12:14 PM

హైదరాబాద్‌ నగరంలో తిరగాలంటే కొత్త వాళ్లకి అదో ఫజిల్ అనే చెప్పాలి. మన పక్కనే మనం వెళ్లాల్సిన ప్రదేశం ఉన్నా.. అక్కడక్కడే తిరుగుతూ.. అడ్రస్‌ వెతుక్కుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు కొత్త వాళ్లే కాదు.. పాత వాళ్లు కూడా తెలిసిన చోటుకు..

Hyderabad Trafic: హైదరాబాదీలకు అలర్ట్.. ఆ రూట్‌కు వెళ్లారంటే ఇక తిరుగుతూనే ఉండాలి..
Trafic In Hyderabad City
Follow us on

హైదరాబాద్‌ నగరంలో తిరగాలంటే కొత్త వాళ్లకి అదో ఫజిల్ అనే చెప్పాలి. మన పక్కనే మనం వెళ్లాల్సిన ప్రదేశం ఉన్నా.. అక్కడక్కడే తిరుగుతూ.. అడ్రస్‌ వెతుక్కుంటూ ఉంటాం. అయితే ఇప్పుడు కొత్త వాళ్లే కాదు.. పాత వాళ్లు కూడా తెలిసిన చోటుకు వెంటనే వెళ్దామంటే కుదరండోయ్‌.. కొత్త ట్రాఫిక్ నిబంధనలతో తిరుగుతూనే ఉండాలి. ముక్కు ఎక్కడుందంటే చుట్టూ తిరిగి చూపించాడనే సామెతలా ఉంది.. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలోని ఆ రూటులో ప్రయాణం. ట్రాఫిక్ నిలిచిపోకుండా.. అధికారులు చేపట్టిన చర్యలతో కొంతమంది ప్రయాణీకులు విసుగు చెందుతున్నారు. గతంలో ట్రయల్‌ రన్‌గా వారం రోజులంటూ చేపట్టిన ఈ ప్రక్రియను రెండు వారాలు గడిచినా.. కొనసాగిస్తున్నారు. దీంతో ఇక ఈ విధానాన్ని కొనసాగించాలని ట్రాఫిక్ పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పద్ధతి విజయవంతమైతే మాత్రం శాశ్వతంగా ఈ రూట్‌లో కొత్త విధానాన్ని అవలంభించాలనే ప్లాన్‌లో ఉన్నారు.

నిత్యం రద్దీగా ఉండే జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 45, పరిసరాల్లో ట్రాఫిక్‌ను సులభతరం చేసేందుకు ట్రాఫిక్‌ మళ్లింపులు విధించారు ట్రాఫిక్ పోలీసులు. వాహనదారులు తమ గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 మార్గంలో ఎక్కువ సమయం వెచ్చిస్తున్నారని గుర్తించిన ట్రాఫిక్ అధికారులు వారి ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి దారి మళ్లింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ రోడ్ నెం 45 జంక్షన్- ఫిల్మ్‌నగర్ సమీపంలోని కొన్ని ప్రదేశాల మధ్య సాగిన పలు ‘యు’ టర్న్‌లను ట్రాఫిక్ పోలీసులు మూసివేశారు. దీనిపై ప్రయాణీకుల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడం, అభ్యంతరాలు రావడంతో ట్రాఫిక్ మళ్లింపు వల్ల కలిగే ప్రయోజనాలను అంచనా వేసే పనిలో పడ్డారు. దీనిలో భాగంగా ఈ విధానం వల్ల ప్రయాణికులకు ప్రయోజనకరంగా ఉన్నట్లు తేలింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుండి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వరకు ప్రయాణించడానికి ఇంతకుముందు ఉన్న ప్రయాణ సమయంతో పోలిస్తే, ఇప్పుడు తక్కువ సమయం పడుతుందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు.

గతంలో కెబిఆర్ పార్క్ జంక్షన్ నుండి కేబుల్ బ్రిడ్జి వైపు వచ్చే వాహనదారులు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ సిగ్నల్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండి ట్రాఫిక్‌లో ఎక్కువ సమయం వాహనాలను నిలపాల్సి వచ్చేది. తర్వాత.. రోడ్ నంబర్ 45 జంక్షన్ వద్ద వేచి ఉండి, ఆపై భారీ ట్రాఫిక్‌లో ప్రయాణించేవారు. దీంతో యు టర్న్‌లను తీసివేశారు. దీంతో కొద్ది నిమిషాల ప్రయాణ సమయం ఆదా అవుతుందని ట్రాఫిక్ పోలీసులు అంచనా వేశారు. ఈ విధానాన్ని భవిష్యత్తులో కొనసాగించాలా లేదా అనేదానిపై ట్రాఫిక్ అధికారులు మరికొద్ది రోజుల్లో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరికొన్ని హైదరాబాద్ వార్తల కోసం చూడండి..