ఆదివారం వస్తే సినిమాలు, పార్కులకు వెళ్లడం సర్వ సాధారణమైన విషయమే. అయితే ఇటీవల మాల్స్‌కి వెళ్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. పార్కుల్లో ఆడుకోవాల్సిన చిన్నారులను మాల్స్‌లో ఉండే ప్లే జోన్స్‌లో ఆడిస్తున్నారు పెద్దలు. ఇలాగే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఓ మాల్‌కి వెళ్లిన చిన్నారికి ఊహించని ప్రమాదం జరిగింది. ఓ ప్రమాదంలో ఏకంగా చేతి వేళ్లు తెగిపోయాయి.
ఇంతకీ ఏం జరిగిందటే.. బంజారాహిల్స్‌లోని సిటీ సెంటర్‌కు వెళ్లిన ఓ చిన్నారి ప్లేజోన్‌లో ఆడుకుంటోంది. ఇదే సమయంలో ప్లేజోన్‌లో మెషీన్‌లో పడి చిన్నారి చేతివేళ్లు తెగిపోయాయి. వెంటనే చిన్నారిని వైద్యుడి దగ్గరి తీసుకెళ్లగా వైద్యులు చేతి వేళ్లకు సర్జరీ చేశారు. మెషిన్ లోకి చేయి వెళ్లడం వల్ల చిన్నారి మూడు వేళ్లు పూర్తిగా నలిగిపోయినట్లు తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి మాల్ నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తున్నాడు. ఇందులో భాగంగానే బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు చేయలేదని సిటీమాల్‌పై ఫిర్యాదు చేశాడు. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..