హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతోంది: మాజీ ఎంపీ

| Edited By: Pardhasaradhi Peri

Sep 10, 2019 | 5:09 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని మాజీ ఎంపీ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. అంతేకాకుండా దీనిపై తనకు రహస్య సమాచారం ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌పై మాత్రమే కాదు.. […]

హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కాబోతోంది: మాజీ ఎంపీ
Follow us on

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌పై కేంద్రం ప్రత్యేక శ్రద్ధను పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భాగ్యనగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబోతున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇక ఇదే విషయాన్ని మాజీ ఎంపీ చెప్పడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్లైంది.

హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చేందుకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని కాంగ్రెస్ మాజీ ఎంపీ చింతా మోహన్ అన్నారు. అంతేకాకుండా దీనిపై తనకు రహస్య సమాచారం ఉందని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది. ఇక హైదరాబాద్‌పై మాత్రమే కాదు.. ఏపీ రాజధానిపై కూడా చింతా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిగా తిరుపతిని చేయడం ఖాయమని ఆయన అన్నారు. జగన్ అమరావతిని వదిలి తిరుపతికి వచ్చేయాలని ఆయన కోరారు. రాజధానికి తిరుపతి అన్ని విధాల అనువైన ప్రాంతం అని చింతా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే రాజధాని అమరావతిపై ఏపీలో మొదలైన రాజకీయ వేడి చల్లారకముందే చింతా చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.