Hyderabad: బాలాపూర్‌లో తీవ్ర విషాదం.. ఫోన్‌ కొనివ్వలేదని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!

హైదరాబాద్‌లోని బాలాపూర్‌లో తీవ్ర విషాదం వెలుగు చూసింది. తల్లిదండ్రులు ఫోన్ కొనివ్వలేదని షేక్ అయాన్ హైమద్ అనే 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్కూల్‌లో టీచర్‌ ఇచ్చే హోం వర్క్‌ చేయాలంటే సెల్‌ఫోన్‌ కావాలని అయాన్‌ కొరగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పుడు కొనలేనని తండ్రి చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన అయాన్‌ ఇంట్లోని ఇనుప రాడ్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

Hyderabad: బాలాపూర్‌లో తీవ్ర విషాదం.. ఫోన్‌ కొనివ్వలేదని 14 ఏళ్ల బాలుడు ఆత్మహత్య!
Hyd Student

Edited By:

Updated on: Jun 16, 2025 | 6:50 PM

ప్రస్తుత జనరేషన్‌ కిడ్స్ చాలా సున్నితంగా ఉంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటూ తల్లిదండ్రులకు కడుపుకొతను మిగిలిస్తున్నారు. ఇంట్లో అమ్మనాన్న తిట్టినా, స్కూల్‌లో టీచర్‌ తిట్టినా, బయట ఫ్రెండ్స్‌ తిట్టినా, అడిగింది కొనివ్వక పోయినా ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లొని బాలానగర్‌లో కూడా ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. తండ్రికి ఫోన్‌ అడిగితే కొనివ్వలేదని మనస్తాపం చెందిన ఓ 14 ఏళ్ల బాలుడు ఇంట్లోని ఇనుప రాడ్‌కు చీరతో ఉరివేసుకొని ప్రాణాలు కోల్పోయాడు.

కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం… బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎర్రకుంట ప్రాంతానికి చెందిన షేక్ నిసార్ హైమద్ ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 14 ఏళ్ల షేక్ అయాన్ హైమద్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. అయాన్‌ స్థానికంగా ఉన్న ప్రభుత్వ స్కూల్‌లో చదువతున్నాడు. అయితే స్కూల్ లో టిచర్స్‌ ఇచ్చే హోం వర్క్ చెయ్యాలంటే సెల్ ఫోన్ ఉండాలని అయాన్ తన తండ్రి నిసార్‌ హైమద్‌కు తెలిపాడు. కానీ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తూ కష్టంగా జీవనం సాగిస్తున్న హైమద్‌ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పుడు కాదు.. తర్వాత ఇప్పిస్తానని కొడుకుకు చెప్పాడు. అయితే చిన్న వయస్సు కారణంగా తండ్రి ఆర్థిక పరిస్థితి ఆ అయాన్‌ అర్థం చేసుకోలేక పోయాడు.

తాను అడిన ఫోన్‌ను తండ్రి కొనివ్వలేదే అనే మనస్తాపానికి గురయ్యాడు. ఇంట్లో అందరు భోజనం చేస్తున్న సమయంలో పక్కన గదిలోకి వెళ్ళి చీరతో ఇనుపరాడుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతసేపటికీ అయాన్ కనిపించకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు పక్కరూమ్‌లోకి వెళ్లి చూడగా.. అక్కడ ఇనుపరాడ్‌కు అయాన్‌ వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా షాక్‌కు గురైన తల్లిదండ్రులు పరిగెత్తుకుంటూ వెళ్లి అయాన్‌ను కిందకు దించి చూడగా అప్పటికే మరణించాడు. ఎంతో కష్టపడి కంటికి రెప్పలా పెంచుకుంటున్న కొడుకు కళ్లెదుటే చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..