Hyderabad: పోలీసులకు మరో సవాల్‌.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు.. నిషేధిత ఇంజెక్షన్లు స్వాధీనం

Hyderabad: దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ఉండటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ఇంజక్షన్లను యువత మత్తుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా వీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తుందన్న దానిపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

Hyderabad: పోలీసులకు మరో సవాల్‌.. సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడులు.. నిషేధిత ఇంజెక్షన్లు స్వాధీనం

Edited By: Subhash Goud

Updated on: Apr 21, 2025 | 9:27 PM

Hyderabad: మత్తు ముఠా నుంచి పోలీసులకు మరో సవాల్‌ ఎదురవుతోంది. ఇప్పటివరకు డ్రగ్స్‌, గంజాయి ముఠా ఆట కట్టించిన పోలీసులకు.. ఇంజక్షన్ల రాకెట్ రూపంలో మరొక పరీక్ష ఎదురవుతోంది. హైదరాబాద్‌లో నిషేధిత ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి. హైదరాబాద్ చదర్ ఘాట్, బండ్లగూడాలో సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి.. నిషేధిత ఇంజెక్షన్ల విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. నిందితుల నుంచి 120 మెఫెన్ టెర్మిన్ ఇంజెక్షన్ సిసలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ మలక్‌పేట్‌కి చెందిన యవార్‌ హుసైన్‌ నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. 50 నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా పట్టుకున్నారు. నిందితుడిని చదర్ ఘాట్ పోలీసులకు అప్పగించారు. మరో కేసులో బండ్ల గూడాకి చెందిన మొహ్మద్‌ సల్మాన్‌, అబ్దుల్‌ వాలి నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్లు సమాచారం అందించింది.

దీంతో రంగంలోకి దిగిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నిందితులు 70 నిషేధిత ఇంజెక్షన్లు విక్రయిస్తుండగా అదుపులోకి తీసుకొని బండ్ల గూడా పోలీసులకు అప్పగించారు. ఏ మందులను అయినా ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి లేకుండా ఉత్పిత్తి చేయడం, విక్రయించడం నేరం. వీటితో ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఔషధ నియంత్రణ సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నా.. ఈజీ మనీకి అలవాటు పడ్డ ముఠాలు వీటితో దందా చేస్తున్నాయి. యువతను లక్ష్యంగా చేసుకుని ఈ దంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాన్పులు, శస్త్ర చికిత్సల సమయంలో రోగికి నొప్పుల బాధలు తెలియకుండా ఈ ఇంజక్షన్లు వాడతారు.

దాదాపు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు మత్తులో ఉండటం వల్ల నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి ఇంజక్షన్లను యువత మత్తుకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం. ఈ ముఠా వీటిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకొని విక్రయిస్తుందన్న దానిపై పోలీసులు ఫోకస్‌ పెట్టారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి