Hyderabad: పోకీరీల పని పడుతున్న షీ టీమ్స్‌.. బోనాల సందర్భంగా..

| Edited By: Narender Vaitla

Aug 05, 2024 | 6:37 PM

మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన చేసిన వారిపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు..బస్ స్టాప్ లు,ప్రధాన ప్రదేశాలలో ఎవరైతే మహిళలు.. యువతులు.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వారిపై కేసులు నమోదు చేసి వీడియోలతో సహా కోర్టులో హాజరు పరుస్తున్నారు షి టీమ్స్ పోలీసులు... పెళ్లి పేరుతో మోసం చేయడం రద్దీగా ఉన్న ప్రదేశాలలో మహిళల పట్ల అసభ్యకరంగా...

Hyderabad: పోకీరీల పని పడుతున్న షీ టీమ్స్‌.. బోనాల సందర్భంగా..
Hyderabad She Teams
Follow us on

మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన చేసిన వారిపై ఫోకస్ పెట్టారు హైదరాబాద్ పోలీసులు..బస్ స్టాప్ లు,ప్రధాన ప్రదేశాలలో ఎవరైతే మహిళలు.. యువతులు.. బాలికల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తారో వారిపై కేసులు నమోదు చేసి వీడియోలతో సహా కోర్టులో హాజరు పరుస్తున్నారు షి టీమ్స్ పోలీసులు… పెళ్లి పేరుతో మోసం చేయడం రద్దీగా ఉన్న ప్రదేశాలలో మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం చిన్న పిల్లలపై అఘాయిత్యానికి పాల్పడడం లాంటి ఘటనలు తరచు జరుగుతూ ఉండడంతో వాటిపై ఫోకస్ పెట్టిన పోలీసులు పోకరిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు మరింత ఫోకస్ పెట్టారు

తాజాగా నగరంలో ఇటీవల జరిగిన బోనాల జ్వాల సందర్భంగా మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వారిని అరెస్టు చేశారు షూటింగ్స్ అధికారులు 35 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేసిన హైదరాబాద్ షీ టీమ్స్ వీరిలో 289 మంది మేజర్లు కాగా 16 మంది మేనర్లు ఉన్నారు వారిలో నూట డెబ్భై మూడు మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఏర్పాటు చేశారు పోలీసులు ఈ ఆకతాయిలలో ఐదుగురు వ్యక్తులను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు షీ టీమ్స్ ముందు హాజరు పరిచారు వారికి మూడు రోజుల జైలు శిక్షతో సహా 1050 రూపాయల జరిమానాను విధించారు.

మహిళలు, పిల్లలపై నేరాలకు సంబంధించి హైదరాబాద్‌లోని వివిధ పోలీస్‌ స్టేషన్స్‌లో 115 కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా నాలుగు ఫోక్సో కేసులను కూడా నమోదు చేశారు పోలీసులు. మరో 22 కేసులలో వ్యక్తులు, వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు పోలీసులు. షీ టీమ్స్ ఫిర్యాదులలో ఎక్కువ కేసులు అత్యాచారం, వివాహం పేరిట మోసం వంటి కేసులే ఎక్కువగా నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..