Hyderabad: పార్కుల్లో రొమాన్స్ చేస్తున్నారా…? మీ వెనకే షీ టీమ్..

హైదరాబాద్‌లోని పలు పబ్లిక్ పార్కుల్లో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్న ఓ సమస్యపై షీ టీమ్స్ నిఘా పెట్టాయి. బెంచీల మీద కూర్చుంటూ, పొదల సమీపంలో పబ్లిక్ గానే రొమాన్స్ చేస్తున్న జంటలను అందుపులోకి తీసుకున్నాయి. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకూడదని కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.

Hyderabad: పార్కుల్లో రొమాన్స్ చేస్తున్నారా...? మీ వెనకే షీ టీమ్..
Couples in Park

Updated on: Feb 24, 2024 | 3:07 PM

హైదరాబాద్, ఫిబ్రవరి 24:  పార్కులు, పబ్లిక్ ప్లేసులు, ఇతర ప్రాంతాల్లో తింగరి వేషాలు వేసే జంటలపై షీ టీమ్స్ ఫోకస్ పెట్టాయి. తాజాగా పలు ప్రాంతాల్లో అనైతిక చర్యలకు పాల్పడుతున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. ఇందిరా పార్క్‌, కృష్ణకాంత్‌పార్క్‌, నెక్లెస్‌రోడ్‌తో పాటు ఇతర బహిరంగ ప్రదేశాల్లో సామాన్యులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించిన జంటలను శుక్రవారం షీ టీమ్స్‌ వెంటాడాయి. 12 మందిని అదుపులోకి తీసుకొని ఫైన్‌ వేసి, కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. పబ్లిక్ ప్లేసుల్లో సామాన్యులకు ఇబ్బందులు కలిగేలా ప్రవర్తిస్తే..  చర్యలు తీసుకుంటామని పోలీసులు వారికి వార్నింగ్ ఇచ్చారు. అన్ని పార్కుల్లో షీ టీమ్స్‌ నిఘా ఉంటుందని చెప్పారు. పార్కుల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించ వద్దని, డీసెంట్ గా ఉండాలని సూచించారు.

ఉరుకుల పరుగుల జీవితంలో.. సాయంత్రం వేళ కుటుంబంతో ఉల్లాసంగా గడపడానికి కొందరు పార్కులకు వస్తుంటారు. వారిలో పిల్లలు, వృద్ధులు కూడా ఉంటారు. వీరందర్ని పట్టించుకోకుండా ప్రేమ జంటలు రొమాన్స్‌లో మునిగి తేలుతున్నాయి. కొందరు అయితే వచ్చేవాళ్లను, పోయేవాళ్లను కూడా పట్టించుకోవడం లేదు. కొందరు ముద్దుల్లో మునిగి తేలుతుండగా.. మరికొందరు హద్దుమీరి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఫ్యామిలీలతో పార్కులకు వెళ్లినవారు ఇబ్బంది పడుతున్నారు.

ఈ సమస్యను గుర్తించిన ఇందిరా పార్క్ యాజమాన్యం గతంలో తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది. 2021 ఆగస్టులో ‘పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదు’ అని పార్క్ బయట బోర్డు పెట్టింది. కాని విమర్శలు రావడంతో.. పార్కు యాజమాన్యం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తాజాగా ప్రేమికుల పనులు హద్దు మీరడంతో షీ టీమ్స్ రంగంలోకి దిగి వార్నింగ్ ఇచ్చాయి.  పబ్లిక్ ప్లేసుల్లో ఇక నుంచి తమ నిఘా ఉంటుందని షీ టీమ్ అధికారులు వెల్లడించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..