భాగ్యనగరంలో మినరల్ వాటర్ ఇక్కట్లు

| Edited By:

Jun 07, 2019 | 2:35 PM

నల్లా నీరు సరిగా రాకపోవడంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతోన్న హైదరాబాద్ వాసులకు ఇప్పుడు మినరల్ వాటర్ కూడా కరువవుతున్నాయి. నిత్యావసరాలకు ఎలా ఉన్నా.. తాగేందుకు మాత్రం మినరల్ వాటర్‌నే కొనుగోలు చేస్తోన్న చాలామంది నగరవాసులకు ఆ నీటిని అందించలేకపోతున్నాయి తయారు చేసే కేంద్రాలు. వర్షపాత లేమి వలన ఏడాదికేడాదికి భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉండటం వలన మినరల్ వాటర్‌ను తయారుచేసే కేంద్రాలకు నీటి కొరత బాగా ఏర్పడింది. దీంతో గృహాలతో పాటు పలు ఆఫీసులకు కూడా వారు […]

భాగ్యనగరంలో మినరల్ వాటర్ ఇక్కట్లు
Follow us on

నల్లా నీరు సరిగా రాకపోవడంతో ఇప్పటికే ఇబ్బందులు పడుతోన్న హైదరాబాద్ వాసులకు ఇప్పుడు మినరల్ వాటర్ కూడా కరువవుతున్నాయి. నిత్యావసరాలకు ఎలా ఉన్నా.. తాగేందుకు మాత్రం మినరల్ వాటర్‌నే కొనుగోలు చేస్తోన్న చాలామంది నగరవాసులకు ఆ నీటిని అందించలేకపోతున్నాయి తయారు చేసే కేంద్రాలు. వర్షపాత లేమి వలన ఏడాదికేడాదికి భూగర్భ జలాలు తగ్గిపోతూ ఉండటం వలన మినరల్ వాటర్‌ను తయారుచేసే కేంద్రాలకు నీటి కొరత బాగా ఏర్పడింది. దీంతో గృహాలతో పాటు పలు ఆఫీసులకు కూడా వారు నీటిని సరఫరా చేయలేకపోతున్నారు. దీని వలన నగరవాసులు తాగు నీటి కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే పేరు మోసిన కంపెనీలలో సైతం తాగునీటి ఇక్కట్లు కొనసాగుతున్నాయి. మినరల్ వాటర్ కోసం భారీ సొమ్ము చెల్లించేందుకు కొన్ని కంపెనీలు సిద్ధంగా ఉన్నా.. ఆ వాటర్‌ను వారికందించేందుకు తయారీదారులకు కష్టంగా మారుతోంది. ఇది ఇలాగే కొనసాగితే భాగ్యనగరంలో తాగునీటి ఇబ్బందులు మరింత పెరగనున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.