Hyderabad: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఏకంగా పోలీస్‌ వాహనాన్నే ఢీకొట్టిన యువకుడు.. కట్‌చేస్తే..

హైదరాబాద్ తీవ్ర విషాదం వెలుగు చూసింది. లంగర్ హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన ఒక యవకుడి అదుపుతప్పి రోడ్డుపై ఉన్న పోలీస్ వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలొ ఒక యువతి స్పాట్‌లోనే మృతి చెందగా ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు

Hyderabad: మద్యం మత్తులో డ్రైవింగ్.. ఏకంగా పోలీస్‌ వాహనాన్నే ఢీకొట్టిన యువకుడు.. కట్‌చేస్తే..
Accident

Updated on: Sep 07, 2025 | 3:19 PM

హైదరాబాద్ తీవ్ర విషాదం వెలుగు చూసింది. లంగర్ హౌస్ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపిన ఒక యువకుడు నేరుగా ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లాడు. ప్రమాదంలో ఒక మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా లంగర్‌హౌస్‌ దర్గా సమీపంలో పోలీసులు ట్రాఫిక్ విధుల్లో ఉన్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో వేగంగా కారుతో దూసుకొచ్చిన ఒక యువకుడు నేరుగా ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లాడు.

ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కశ్వి అనే యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు స్పల్వంగా గాయపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన ఇతర పోలీస్‌ సిబ్బంది. వాహనదారులు వెంటనే గాయపడిన వారికి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు.

మరోవైపు ప్రమాద సమాచారం అంతుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాద సమయంలో కారులో ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులూ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి.