Hyderabad: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి రియాల్టర్ మర్డర్‌

హైదరాబాద్‌ మహానగరంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో రియాల్టర్ వ్యాపారి వెంకటరత్నం (46)ను దుండగులు అతి కిరాతకంగా చంపారు. స్కూటీపై వెళ్తున్న రియల్టర్‌ను వెంబడించి మరీ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నడిరోడ్డుపై వేట కత్తులతో పొడిచి..

Hyderabad: పట్టపగలు నడిరోడ్డుపై దారుణం.. వేట కత్తులతో నరికి, తుపాకీతో కాల్చి రియాల్టర్ మర్డర్‌
Hyderabad Realtor Murder Case

Updated on: Dec 08, 2025 | 6:20 PM

హైదరాబాద్‌, డిసెంబర్ 8: హైదరాబాద్‌ మహానగరంలో పట్టపగలు దారుణం చోటు చేసుకుంది. జవహార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫోస్టర్ బిల్లా బాంగ్ స్కూల్ సమీపంలో రియాల్టర్ వ్యాపారి వెంకటరత్నం (46)ను దుండగులు అతి కిరాతకంగా చంపారు. స్కూటీపై వెళ్తున్న రియల్టర్‌ను వెంబడించి మరీ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నడిరోడ్డుపై వేట కత్తులతో పొడిచి, తుపాకీతో కాల్చి అతి కిరాతకంగా చంపేశారు. సాకేత్‌ కాలనీ ఫోస్టర్‌ బిల్లా బాంగ్‌ స్కూల్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకెళ్తే..

వెంకటరత్నంపై ధూల్‌పేట్‌లో రౌడీషీట్‌ ఉన్నట్లు గుర్తించారు. గతంలో జంట హత్యల కేసులో ఆయన నిందితుడిగా ఉన్నారు. పాత కక్షలే హత్యకు కారణం అని అనుమనిస్తున్న పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. నడిరోడ్డుపై రత్నం బైక్‌పై వెళుతుండగా ప్లాన్ ప్రకారం వెంబడించిన గుర్తు తెలియని వ్యక్తులు తొలుత గన్‌తో షూట్ చేసి, ఆపై కత్తితో పొడిచి దారుణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ప్రత్యర్థులే చంపి ఉంటారా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. క్లూస్‌ టీమ్‌, ఫొరెన్సిక్‌ బృందాలతో విచారిస్తున్నట్లు మల్కాజిగిరి డీసీపీ శ్రీధర్‌ తెలిపారు. వెంకటరత్నం తల, మెడ, పొట్ట భాగాల్లో దారుణంగా కత్తులతో పొడిచినట్లు పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.

కాగా మృతుడు వెంకట రత్నం బైక్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో ఆటో, బైక్ లో వచ్చిన మొత్తం 6 గురు నిందితులు రాంగ్ రూట్ లో వచ్చి వెంకట రత్నం బైక్ కు అడ్డంగా ఆటో ఆపి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆటోలో నుండి దిగుతూనే కత్తులతో వెంకట్ రత్నం పై దాడి చేశారు. ఇంతలో మరో నిందితుడు గన్ తో ఫైర్ చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు CC కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. వెంటక రత్నం చనిపోయాడు అని నిర్ధారించుకున్న నిందితులు మళ్లీ అదే ఆటోలో వెళ్ళిపోయారు. వెంకట్ రత్నంపై దూల్పేటలో రౌడీషీట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో జంట హత్య ల కేసులో వెంకటరత్నం నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో వెంకటరత్నంని ప్రత్యర్థులే చంపి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.