మల్కాపూర్ పంచాయతీ ఎన్నికలలో గెలుపు కోసం శంషూద్దీన్ అనే అభ్యర్థి మంత్రించిన ఆవాలు, పసుపు చల్లి కలకలం రేపాడు. శుక్రవారం రాత్రి బైక్పై తిరుగుతూ ఈ చర్యలకు పాల్పడ్డాడు. సీసీ కెమెరాల్లో దృశ్యాలు రికార్డు కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.