Hyderabad: హైదరాబాద్‌లో రియల్‌ భూమ్.. రూ.177 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడంటే?

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌లో మరోసారి సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములు వేలానికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. TGIIC నిర్వహించిన ఈ వేలంలో మొత్తం 7.67 ఎకరాల భూమిని MSN రియాల్టీ దక్కించుకుంది.

Hyderabad: హైదరాబాద్‌లో రియల్‌ భూమ్.. రూ.177 కోట్లు పలికిన ఎకరం భూమి.. ఎక్కడంటే?
Hyderabad Real Estate

Updated on: Oct 06, 2025 | 9:11 PM

హైదరాబాద్ రియల్‌ ఎస్టేట్‌లో మరోసారి సరికొత్త రికార్డు నమోదైంది. రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని భూములు వేలానికి ఊహించని రీతిలో స్పందన వచ్చింది. ఇక్కడ భూమిని వేలం వేయగా ఎకరం ఏకంగా రూ.177 కోట్లు పలికింది. TGIIC రాయదుర్గంలోని నాలెల్జ్‌ సిటిలో ఉన్న తన భూములను వేలానికి వేయగా. ఈ వేలంలో అనేక రియల్‌ ఎస్టేట్ సంస్థలు పాల్గొన్నాయి. అయితే ఎకరం ప్రారంభ ధర రూ.101 కోట్లు ఉండగా ఈ భూములను సొంతం చేసేకునేందుకు వేలం హోరాహోరీగా సాగింది.

చివరకు ప్రముఖ రియల్‌ ఎస్టేట్ సంస్థ అయిన MSN రియాల్టీ ఏకంగా ఎకరం భూమిని రూ.177 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. TGIIC నిర్వహించిన ఈ వేలంలో MSN రియాల్టీ మొత్తం 7.6 ఎకరాల భూమిని రూ.1,356 కోట్లుగా వెచ్చించి సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా గతంలో కోకాపేటలోని నియోపోలిస్ పాంతంలో నిర్వహించిన వేలంలో ఎకరం భూమి రూ.100 కోట్లు పలికింది. దీంతో ఇక్కడ నిర్వహించిన భూమికి ప్రారంభ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించినట్టు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.