
గత రెండు మూడు రోజులుగా హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఇప్పటినే నగరంలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన ప్రాంతాల్లో రోడ్లు, కాలనీలన్ని చెరువలను తలిపిస్తున్నాయి. దీంతో నగరవాసులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయితే గురువారం కూడా హైదరాబాద్‌లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇప్పటికే హైదారాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.
ముఖ్యంగా ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉండే హైటెక్ సిటీ, రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో వాహనాల కదలిక కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు ఆయా ప్రాంతాల్లోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు గురువారం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఐటీ కంపెనీల యజమానులు పోలీసులకు సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు.
మరోవైపు నగరంలోని వాహనదారులను కూడా పోలీసులు అలర్ట్ చేశారు. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందుకు ప్రజల ఎవరూ అనవసరంగా బయటకు రావద్దని.. ఏదైనా అత్యవస పనులు ఉంటే మాత్రమే బయటకు రావాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.