Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ రియల్‌ భూమ్.. రాయదుర్గంలో ఎకరం అన్ని కోట్లా..!

హైదరాబాద్‌లో మరోసారి రియల్ భూమ్‌ కనిపించనుందా?. ఎకరా 100 కాదు 150 కోట్లు పలకనుందా?. అక్టోబర్ 6న ఏం జరగబోతుంది. ప్రభుత్వ భూముల వేలం ఏ విధంగా ఉండబోతుంది. ఆ డీటేల్స్ అన్నీ ఈ కథనం లోపల తెలుసుకుందాం .. ..

Hyderabad: హైదరాబాద్‌లో మళ్లీ రియల్‌ భూమ్.. రాయదుర్గంలో ఎకరం అన్ని కోట్లా..!
Land Auction

Updated on: Sep 15, 2025 | 9:22 PM

హైదరాబాద్‌లో మళ్లీ రియల్‌ భూమ్ వచ్చేలా ఉంది. భూముల ధరలు అమాంతం పెరగబోతున్నాయన్న అంచనాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలో జరిగే వేలంలో ఎకరా రిజర్వ్ ధరనే 101 కోట్ల రూపాయలుగా ప్రకటించింది సర్కార్. ఆ రోజు జరిగే వేలంలో ఎకరా ధర 150 కోట్ల రూపాయలు టచ్‌ చేయబోతుందన్న అంచనాలున్నాయి. అంతకు మించి కూడా పలికే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూములను అక్టోబర్‌ 6న ఈ- వేలం వేయనుంది ప్రభుత్వం. ఒక్కో ఎకరా రిజర్వ్ ధర రూ.101 కోట్లుగా నిర్ణయించింది. సర్వే నంబరు 83/1లో ప్లాట్ నెంబర్‌ 19లో 11 ఎకరాలు, ప్లాట్ నెంబర్ 15A/2లో 7.67 ఎకరాలు వేలం వేయబోతుంది. రిజిస్ట్రేషన్ ఫీజు 1180 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. బిడ్ డాక్యుమెంట్ ఫీజు ఒక్కో ప్లాట్‌కు 10 లక్షల రూపాయలు ఉంటుంది.. దీనికి GST అదనం. బిడ్ దాఖలుకు అక్టోబరు 1 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చింది. అక్టోబరు 4వ తేదీ వరకు ల్యాండ్ విజిటింగ్‌కు సమయం ఇచ్చారు. అక్టోబరు 6న మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వేలం వేస్తారు.

రాయదుర్గంలో భూముల వేలంతో రూ.2 వేల కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us