Hyderabad: హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో రోడ్డెక్కారో ఇక అంతే

హైదరాబాద్ నగరవాసులకు ట్రాఫిక్ పోలీస్ కీలక ఆదేశాలు ఇచ్చారు. మార్చి 1 నుంచి లైసెన్స్ లేకుండా వెహికిల్ నడపరాదని పేర్కొన్నారు. అలా నడిపితే కచ్చితంగా బండి సీజ్ అన్నట్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా.. ఓ సారి లుక్కేయండి.

Hyderabad: హైదరాబాదీస్ అటెన్షన్.! ఆ డేట్ నుంచి లైసెన్స్ లేకుండా బండితో రోడ్డెక్కారో ఇక అంతే
Traffic Police

Edited By:

Updated on: Feb 11, 2026 | 5:24 PM

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నగరవాసులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. మార్చి 1 నుంచి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపేవారిపై నిరంతర ప్రత్యేక దాడులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్‌ను వెంట ఉంచుకోవాలని సూచించారు. లైసెన్స్ లేనివారు వెంటనే ఆర్టీఏ(RTA) ద్వారా లైసెన్స్ పొందాలని పేర్కొన్నారు. అలాగే, వాహన యజమానులు తమ వాహనాలను లైసెన్స్ లేని వ్యక్తులకు అప్పగించొద్దని పోలీసులు హెచ్చరించారు.

లైసెన్స్ లేని వ్యక్తితో వాహనం నడిపించడం కూడా నేరమేనని స్పష్టం చేశారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపే సమయంలో ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ కూడా రాదని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. కాబట్టి వాహనం డ్యామేజ్ అయినప్పుడు జేబు నుంచి నగదు పోకుండా ఉండేందుకు, చట్టపరమైన సమస్యలు తప్పించుకోవాలంటే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని కోరారు. కాగా గత 10 రోజులుగా రాంగ్ రూట్‌లో వాహనాలు నడిపేవారిపై పోలీసులు పెద్ద ఎత్తున కేసులు నమోదు చేశారు. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ లేనివారి ఆట కట్టించనున్నారు.

మరోవైపు వెహికల్ రిజిస్ట్రేషన్ సమయంలో చలాన్ల కోసం బ్యాంక్ ఖాతా వివరాలు సేకరిస్తున్నరనే ప్రచారంలో నిజం లేదని రవాణా శాఖ స్పష్టం చేసింది. చలాన్ల కోసం రిజిస్ట్రేషన్ నెంబర్లను లేదా ఓనర్ల బ్యాంక్ ఖాతాలను లింక్ చేసి, డబ్బులు ఆటోమేటిక్‌గా కట్ అయ్యేలా చేసే విధానం ఏదీ ప్రస్తుతం అమాలులో లేదని వివరణ ఇచ్చింది. అలాంటి విధానాన్ని అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయలేదని పేర్కొంది.