Hyderabad Water Supply: తాగునీటి సరఫరాకు సంబంధించి భాగ్యనగర వాసులకు హైదరాబాద్ జల మండలి కీలక సూచనలు చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మంజీరా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీం (ఎండబ్ల్యూఎస్ఎస్) ఫేజ్ -2లో కలాబ్‌గూర్ నుంచి పటాన్‌చెరు వరకు ఉన్న 1500 ఎంఎం డయా పీఎస్‌సీ పంపింగ్ మెయిన్ పైప్‌లైన్‌కు వివిధ ప్రాంతాల్లో లీకేజీల నివారణకు మరమ్మతులు, కంది గ్రామం వద్ద జంక్షన్ పనులు చేపట్టనుంది. ఆ కారణంగా భాగ్యనగరంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం కలుగుతుందని వెల్లడించింది.
తాగునీటి సరఫరా బంద్..
తేదీ: 29.10.2021 శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి మరుసటి రోజు అనగా తేదీ: 30.10.2021 శనివారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు ఈ పనులు కొనసాగనున్నాయి. ఈ 36 గంటలపాటు మంజీరా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీం(ఎండబ్ల్యూఎస్ఎస్) ఫేజ్ -2 పరిధిలోకి వచ్చే పటాన్‌చెరు నుంచి హైదర్‌నగర్ వరకు మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9: హైదర్‌నగర్, రాం నరేష్‌నగర్, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్, వసంత్ నగర్, ఎస్‌పీనగర్ తదితర ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 15: మియాపూర్, దీప్తినగర్, శ్రీనగర్, మాతృశ్రీనగర్, లక్ష్మీనగర్, జేపీ నగర్, చందానగర్ తదితర ప్రాంతాలు.
3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 23: నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట, ప్రగతినగర్.
4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 32: బొల్లారం.
కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదారాబాద్ జలమండలి అధికారులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు.
Also Read: