Hyderabad: హైదరాబాద్​లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త

|

Jul 29, 2021 | 11:04 AM

హైదరాబాద్​లో నివశిస్తున్న ప్రజలకు ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చింది.  దోమల మనుషులపై దండెత్తి వస్తున్నాయి. ఫలితంగా ప్రమాదకర...

Hyderabad: హైదరాబాద్​లో దోమల పరేషాన్. 34 వేల హాట్‌స్పాట్ల గుర్తింపు.. కరోనా కల్లోలంలో తస్మాత్ జాగ్రత్త
Follow us on

హైదరాబాద్​లో నివశిస్తున్న ప్రజలకు ఇప్పుడు కొత్త టెన్షన్ వచ్చింది.  దోమల మనుషులపై దండెత్తి వస్తున్నాయి. ఫలితంగా ప్రమాదకర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అసలే కరోనాతో ఫైట్ చెయ్యడానికి ప్రజలు ఇమ్యూనిటీ పవర్ ఉపయోగించారు. ఇప్పుడు దోమల కారణంగా వ్యాప్తి చెందే డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకితే.. పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. సాయంత్రం 5 దాటితే ఇంటి కిటికీలు, తలుపులు తెరవలేని దుస్థితి నెలకొంది. నాలాలు, చెరువులు, కుంటలు, నీరు నిలిచే ప్రాంతాల్లో దోమలు పెద్దఎత్తున తన సంఖ్యను పెంచుకుంటున్నాయి.  జీహెచ్‌ఎంసీ దోమల నివారణ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విమర్శల తీవ్రత పెరగడంతో అధికారులు అప్రమత్తమై, చర్యలను ముమ్మరం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నగరవ్యాప్తంగా సర్వే చేపట్టిన అధికారులు.. డివిజన్లవారీగా అతి సమస్యాత్మక (వల్నరబుల్‌ ఏరియాలు) ప్రాంతాలను, దోమల వృద్ధికి కారణమయ్యే హాట్‌స్పాట్లను, ఖాళీ స్థలాలను గుర్తించారు. అక్కడి పరిస్థితిని చక్కదిద్దడమే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ విభాగం 100రోజుల కార్యాచరణతో రంగంలోకి దిగుతోంది. తాజాగా 2,250 మంది సిబ్బందితో కూడిన వందలాది బృందాలు రంగంలోకి దిగాయి.

దోమలతో సతమతమవుతున్న 360 అతి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. అక్కడ దోమల వృద్ధికి దోహదపడే వాతావరణం ఉందని, ప్రజలు స్వీయ నివారణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో తరచుగా జ్వరం సర్వే నిర్వహణ, దోమల నివారణ మందు పిచికారి జరుగుపుతున్నారు.  ప్రజలు ఇళ్లలోని నీటి తొట్టెలను, పూలకుండీలను, ఇతరత్రా ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లో, సెల్లార్లలో, తాళం వేసిన ఇళ్లల్లో, తెరచిన నీటి ట్యాంకుల్లో, ఖాళీ స్థలాల్లోని నీటి మడుగుల్లో, స్కూళ్లలో, ఫంక్షన్‌హాళ్లలో నీరు నిలిచి రోజుల తరబడి అలాగే ఉంటోంది. అందులో దోమలు గుడ్లు పెట్టి సంతానాన్ని వృద్ధి చేస్తున్నాయి. అలాంటి 34,286 హాట్‌స్పాట్లను జీహెచ్‌ఎంసీ గుర్తించింది. అక్కడ నివారణ చర్యలు చేపట్టేలా సిబ్బందికి ఆదేశాలిచ్చింది.

Also Read: బెంగళూరు హిజ్రాలు Vs రాయలసీమ హిజ్రాలు.. సినిమా స్టైల్లో గ్యాంగ్ వార్

   క‌రోనా క‌ల్లోలంలోనూ క్షుద్రపూజలు.. ఆది, గురు వారాలు వచ్చాయంటే వణుకే