Hyderabad Metro: మెట్రో ఉద్యోగుల మెరుపు సమ్మె.. నిలిచిపోయిన సేవలు.. ధర్నా చేస్తున్న మెట్రో సిబ్బందికి HMRL వార్నింగ్

|

Jan 03, 2023 | 1:28 PM

ఓ వైపు సడన్ సమ్మె.. మరో వైపు వార్నింగ్‌లు.. ఐదేళ్లు గడుస్తున్న జీతాలు పెంచడం లేదని ఆందోళన బాట పట్టారు హైదరాబాద్ మెట్రో ఉద్యోగులు. స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నాలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చింది ఉద్యోగుల కాంట్రాక్ట్ యాజమాన్యం.

Hyderabad Metro: మెట్రో ఉద్యోగుల మెరుపు సమ్మె.. నిలిచిపోయిన సేవలు.. ధర్నా చేస్తున్న మెట్రో సిబ్బందికి HMRL వార్నింగ్
Hyderabad Metro
Follow us on

ధర్నా చేస్తున్న మెట్రో సిబ్బందికి ఆ సంస్థ యాజమాన్యం హెచ్‌ఎంఆర్ఎల్ వార్నింగ్ ఇచ్చింది. మెట్రో సేవలకు అంతరాయం కలిగించినందుకు చర్యలు తీసుకుంటున్నట్లుగా హెచ్చరించింది. స్వార్థ ప్రయోజనాల కోసం ధర్నా చేస్తున్నరని సీరియస్ అయ్యింది. అయితే యాజమాన్యం హెచ్చరికలపై ఉద్యోగులు కూడా అదే తరహాలో రియాక్ట్ అయ్యారు. మా సమస్యల ప్రస్తావిస్తే ఉద్యోగాల నుంచి తీసేస్తారా అంటు సిబ్బంది ప్రశ్నించారు. మంగళవారం ఉదయం రెడ్ లైన్ సేవల వద్ద ఉద్యోగులు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. ఐదేళ్ల నుంచి జీతాలు పెంచడం లేదంటూ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా విధులు బహిష్కరించారు. దీంతో ఎల్బీనగర్-మియాపూర్ మార్గంలో రైళ్ల సర్వీసులు నిలిచిపోయాయి.

ఐదేళ్ల నుంచి తమకు జీతాలు అస్సలు పెంచడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో జీతాలు సరైన సమయానికి కూడా ఇవ్వడం లేదని మెట్రో టిక్కెట్‌ కౌంటర్లలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం విధుల్లో రూడా నిర్ణీత సమయం పాటించడం లేదని.. రిలీవర్ రాకపోతే తామే అదనపు గంటలు పనిచేయాల్సి వస్తోందన్నారు.

కనీసం భోజనం చేయడానికి కూడా సమయం ఇవ్వడం లేదన్నారు. ఐదేళ్లుగా నెలకు 11వేల రూపాయలు మాత్రమే జీతం ఇస్తున్నారని.. ప్రస్తుత ధరల ప్రకారం ఆ మొత్తం కుటుంబ పోషణకు కూడా సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం