AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కండక్టర్ అక్కర్లేదు.. ఆన్‌లైన్‌లోనే బస్సు టికెట్ పొందవచ్చు.. మొబైల్‌లో ఈ యాప్ ఉంటే..

హైదరాబాద్ ప్రజలకు గుడ్ న్యూస్. తెలంగాణ ప్రభుత్వం మెట్రో,ఆర్టీసీ సేవలను అనుసంధానిస్తూ కామన్ పాస్‌లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పాస్ ద్వారా ఆర్టీసీ, మెట్రోలలో ప్రయాణం చేయవచ్చు. నగరవ్యాప్తంగా ఎక్కడనుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయవచ్చు. దీని వల్ల ప్రతీసారి టికెట్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు.

Hyderabad: కండక్టర్ అక్కర్లేదు.. ఆన్‌లైన్‌లోనే బస్సు టికెట్ పొందవచ్చు.. మొబైల్‌లో ఈ యాప్ ఉంటే..
Metro
Venkatrao Lella
|

Updated on: Oct 02, 2026 | 3:24 PM

Share

హైదరాబాద్ సిటీ ప్రయాణికులకు గుడ్ న్యూస్. మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులకు కలిపి కామన్ పాస్‌లను ప్రభుత్వం తీసుకొచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్ , వివేక్ దీనిని అధికారికంగా ప్రారంభించారు. దీంతో ఆర్టీసీ బస్ – మెట్రో రైల్ కలిపి రోజు వారి, నెల వారి పాసులు అందుబాటులోకి వచ్చాయి. ఆర్టీసీ మెట్రో రైల్ జాయింట్ పాస్‌తో ఆర్టీసీ బస్సు, మెట్రో రైళ్లల్లో  ఎక్కడినుంచి ఎక్కడికైనా ప్రయాణించే చేసే సదుపాయం అందుబాటులోకి వచ్చింది.రోజు వారి పాస్ ధర రూ.400, నెల వారి పాస్ ధర రూ.8500 ఖరారు చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. కండక్టర్‌తో పని లేకుండా మొబైల్‌లోనే టికెట్ పొందే సదుపాయం తీసుకొచ్చారు. ఫిజికల్ టికెట్ అవసరం లేకుండా మొబైల్‌లోనే టికెట్ పొందే సదుపాయం అమల్లోకి వచ్చింది. వారం రోజుల పాస్‌లను సైతం ఆర్టీసీ తీసుకొచ్చింది. మీ టికెట్ యాప్ ద్వారా మొబైల్‌లోనే రోజు వారి టికెట్, డే పాస్, వారం రోజుల బస్ పాస్, నెల వారి బస్ పాస్ పొందవచ్చు. అప్ గ్రేడ్ చేసిన మీ టికెట్ యాప్‌ను ప్రభుత్వం ప్రారంభించింది.

పాస్‌లు ఎక్కడ పొందవచ్చు..

ప్రతి మెట్రో స్టేషన్‌లో కామన్ పాస్ పొందే అవకాశం ఉంది. దీంతో ఏదైనా మెట్రో స్టేషన్‌లో దీనిని పొందవచ్చు. అలాగే ఆర్టీసీ బస్టాండ్లు, రిజర్వేషన్ల కౌంటర్లలో కూడా ఆఫ్‌లైన్‌లో పొందవచ్చు. ఈ పాస్‌తో ORR పరిధిలోని సిటీ బస్సులతో పాటు మెట్రో రైళ్లల్లో ప్రయాణం చేయవచ్చు. ఒకే ప్రయాణానికి రెండుసార్లు టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. దీని వల్ల 25 లక్షలకు పైగా RTC బస్సు ప్రయాణికులకు ప్రయోజనం కలగనుంది. ఇక 4.5 లక్షల మెట్రో ప్రయాణికులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. ఈ పాస్‌ల వల్ల మెట్రో–బస్సుల మధ్య లాస్ట్ మైల్ కనెక్టివిటీ మెరుగుపడనుంది. ప్రయాణికులు సులభమైన, వేగవంతమైన, సమగ్ర ప్రయాణ సౌకర్యం పొందవచ్చు. ఈ కామన్ పాస్ ప్రారంభం సందర్భంగా.. ఒక్క రోజు కామన్ పాస్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనుగోలు చేశారు. అధికారులకు, మంత్రులకు 15 పాస్‌లు కొనుగోలు చేశారు డిప్యూటీ సీఎం. మంత్రి పొన్నం ప్రభాకర్‌కు డబ్బులు ఇచ్చి డిప్యూటీ సీఎం భట్టి కొనగోలు చేశారు. రేపు మంత్రుల, అధికారులు కామన్ పాస్ ద్వారా మెట్రోలో ప్రయాణం చేయనున్నారు.

రేపు ఉదయం 10 గంటలకు బేగంపేట నుండి ఆర్టీసీ – మెట్రో కామన్ పాస్ ద్వారా మెట్రోలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,మంత్రులు ప్రయాణం చేస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రజా రవాణా వ్యవస్థ బలోపేతం అయితే ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం తగ్గుతాయన్నారు. ఆర్టీసీ, మెట్రో, ఆటో సేవలను సమన్వయం చేసి ప్రజలకు సులభమైన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని స్పష్టం చేశారు.

Follow Us