కోట్ల ఆస్తిని, కుటుంబ సభ్యులను కాదు అనుకుని ఓ వివాహిత తనకు నచ్చినట్లుగా బతకాలి అని నిర్ణయించుకుంది.. ఇంటిని, కుటుంబ సభ్యులను అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరం వెళ్లిపోవాలి అనుకుంది.. తన పేరును, ఊరును, మతాన్ని అన్నింటిని మార్చుకొని తనకు నచ్చినటువంటి వ్యక్తితో సంతోషంగా ఉండాలి అని అనుకుంది.. ఐదేళ్ల క్రితం ఇంట్లో నుంచి వెళ్లిపోయినటువంటి వివాహిత కేసులో సినిమాలో లాంటి ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి.
తనకు తాను నచ్చనటువంటి జీవితాన్ని జీవించాలి అంటే చాలా కష్టం.. ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో అలాంటి జీవితాన్ని గడపాలని అందరూ అనుకంటారు కానీ కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొంతమంది కన్న తల్లిదండ్రుల కోసం పిల్లల కోసం కష్టాలను భరిస్తూ.. జీవితం అంటే ఇంతే అనుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు… కానీ హుమాయ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఓ మహిళ తనకు ఉన్నటువంటి కోట్ల ఆస్తుల రూపాయలను కాదు అనుకుంది తల్లిదండ్రులను, కట్టుకున్న భర్తను సైతం వదిలివేసి తనకు నచ్చినటువంటి జీవితాన్ని జీవించాలని భావించింది. ఆ విధంగా ఇంట్లో నుండి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. రెండు మూడు సార్లు ప్రయత్నాలు చేయగా ధైర్యం సరిపోక తిరిగి ఇంటికి వచ్చేసిం.ది అలా వచ్చిన తర్వాత కూడా ఏమాత్రం తాను అనుకున్నట్లుగా జీవితం లేకపోవడంతో ఈసారి గట్టిగా నిర్ణయించుకొని అన్ని ఆధారాలను మొబైల్ ఫోన్ తో సహా వదిలివేసి ఇంట్లో నుండి వెళ్లిపోయింది…
2018 జూన్ 29వ తేదీన హుమాయ నగర్ నుంచి 36 ఏళ్ల వివాహిత ఇంట్లో నుండి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మొబైల్ ఫోన్ తో సహా అన్ని ఆధారాలను ఇంట్లోనే వదిలివేసి వెళ్ళిపోయింది. మొదటినుండి భర్తతో మనస్పర్ధలు ఉన్న ఆ వివాహిత 2014 -15 లోను ఈ విధంగానే ఇంట్లో నుండి వెళ్లిపోయి తిరిగి వచ్చింది. కానీ ఈసారి వెళ్లినటువంటి వివాహిత ఎన్నిసార్లు వెతికినా ఎంత వెతికినా ఆచూకీ మాత్రం లభించలేదు. దీంతో వివాహిత తల్లిదండ్రులు భర్త బేధింపుల వలన ఇంట్లో నుండి తమ కూతురు వెళ్లిపోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2019లో వివాహిత తండ్రి కోర్టులో రిట్ పిటిషన్ వేయగా మహిళల భద్రతా విభాగం మానవ అక్రమ రవాణా విభాగం నుంచి సహాయం తీసుకోవాల్సిందిగా పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన మహిళా భద్రత విభాగం సదరు వివాహిత మహిళ క్యాబ్ బుక్ చేసుకోవడానికి మొబైల్ వాడినట్లు గుర్తించారు. అనంతరం మహిళా వాయిస్ రికార్డ్ ని సైతం కలెక్ట్ చేసుకోగా పూణేకు వెళ్ళినట్లు సమాచారాన్ని సేకరించారు.. అక్కడికి వెళ్లినటువంటి మహిళ ఆ ఫోన్‌ని సైతం వదిలివేయడంతో మళ్లీ కేసు మొదటికి వచ్చింది.. ఇన్నాళ్లుగా ఆ కేసులో పురోగతి లేదు. కానీ ఆమె గత నెలలో ఆధార్ అప్ డేట్ చేయడంతో.. పోలీసులకు ఒక చిన్న క్లూ దొరికింది. మళ్ళీ దర్యాప్తుని ప్రారంభించినటువంటి పోలీసులు ఆమె ఆధార్ కార్డు వివరాలను మార్చినట్లుగా గుర్తించారు. ఊరు పేరు, మతం, భర్త పేరు మార్చినటువంటి ఆ ఆధార్ కార్డును గుర్తించి.. బ్యాంకు డీటెయిల్స్ తో సహా సోషల్ మీడియా అకౌంట్‌ను గుర్తించారు. ఈ వివరాల ఆధారంగా ఆమె గోవాలో ఉన్నట్లు కనుక్కున్నారు.. అనంతరం గోవా నుంచి ఆమెను హైదరాబాదుకు తీసుకువచ్చి కోట్లు హాజరుపరచుగా.. తనకు తాను నచ్చినట్లుగా బ్రతకాలని నిర్ణయించుకున్న వెళ్లిపోయినట్లు మహిళ సమాచారాన్ని ఇచ్చింది. ఇంతటితో కథ సుఖాంతం అయింది.
మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..