Hyderabad: మణికొండలో వ్యక్తి గల్లంతు.. 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా దొరకని ఆచూకి

|

Sep 26, 2021 | 11:24 AM

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి 2 గంటల పాటు దంచికొట్టిన వాన.. నగరాన్ని ముంచేసింది. ఏకధాటిగా కురిసిన కుండపోతకు నాలాలు పొంగి పొర్లాయి.

Hyderabad: మణికొండలో వ్యక్తి గల్లంతు.. 12 గంటలుగా రెస్క్యూ ఆపరేషన్.. ఇంకా దొరకని ఆచూకి
Manikonda Missing
Follow us on

హైదరాబాద్‌లో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం రాత్రి 2 గంటల పాటు దంచికొట్టిన వాన.. నగరాన్ని ముంచేసింది. ఏకధాటిగా కురిసిన కుండపోతకు నాలాలు పొంగి పొర్లాయి. మణికొండలో డ్రైనేజీ గుంతలో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. మణికొండ గోల్డెన్‌ టెంపుల్‌ ముందు నడుచుకుంటూ వెళ్తున్న అతను..నీటిలో గుంత కనిపించక అందులో పడిపోయాడు. దాదాపు 12 గంటలుగా గాలింపు కొనసాగుతోంది. రెండు DRF బృందాలు గాలిస్తున్నాయి. తూములు వెళ్లి నాళా కలిసే ప్రాంతంలో ఒక బృందం గాలిస్తోంది. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నెక్నాంపూర్ చెరువు వద్ద మరో బృందం గాలింపు చర్యలు జరుపుతోంది.  నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో చెరువు వరకూ వెళ్లే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి వివరాలు ఇంకా తెలియలేదు.

మణికొండలో శనివారం అత్యధికంగా 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్‌ మిగిలిన అన్ని ప్రాంతాల్లో 4 సెంటీమీటర్లకు పైగానే వర్షంపాతం నమోదైంది. మణికొండలో శనివారం నాలా వర్క్‌ చేసిన సిబ్బంది..చిన్న సైన్‌ బోర్డులు తప్ప ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేయలేదు. ఐతే భారీ వర్షానికి ఆ సైన్‌ బోర్డులు కొట్టుకుపోయాయి. ఆ గుంతను గమనించకుండా వచ్చిన ఆ వ్యక్తి నాలాలో పడి గల్లంతయ్యాడు.ఐతే తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటున్నారు అధికారులు. వర్షం రావడంతో మట్టి కొట్టుకుపోయి నాలా ఉన్నట్లు తెలియలేదన్నారు. అయితే స్థానికులు మాత్రం అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమంటున్నారు. ఎలాంటి సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. 3 నెలల నుంచి వర్క్‌ జరుగుతోందని..ఇవాల్టి వరకు ఎలాంటి బోర్డులు ఏర్పాటు చేయలేదంటున్నారు.

Also Read: వరుడు తాళి కడుతుంటే.. మంగళ సూత్రం విసిరికొట్టిన వధువు… చివర్లో మాములు ట్విస్ట్ కాదు

 బతికున్న పామును మింగిన వ్యక్తి.. ఆ తర్వాత షాకింగ్