Hyderabad: ఆ ఏటీఎంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 బయటకు.. కట్ చేస్తే..

పాతబస్తీలోని ఓ ఏటీఎంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 బయటకు రావడంతో స్థానికులు కంగుతిన్నారు. మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి ఈ ఇన్సిడెంట్ వెలుగుచూసింది.

Hyderabad: ఆ ఏటీఎంలో రూ.500 డ్రా చేస్తే రూ.2500 బయటకు.. కట్ చేస్తే..
ATM dispenses 5 times extra cash

Updated on: Jan 04, 2023 | 7:02 AM

అది ఓల్డ్ సిటీ ఏరియా. ఎగ్జాట్‌గా చెప్పాలంటే.. మొఘల్‌పురా పోలీసు స్టేషన్‌ పరిధి ప్రాంతం. అక్కడి హరిబౌలి చౌరస్తాలో ఓ HDFC బ్యాంక్ ఏటీఏం ఉంది. ఆ ఏటీఎంలో రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 బయటకు రావడంతో.. జనాలు ఆశ్చర్యపోయారు. మంగళవారం రాత్రి  సమయంలో ఈ ఘటన జరిగింది. అప్పటికే ఎంతమంది అలా డ్రా చేశారో తెలియదు కానీ..  శాలిబండకు చెందిన ఓ వ్యక్తి  మాత్రం తాను రూ.500 డ్రా చేస్తే.. రూ.2500 వస్తున్నాయని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఎంత మంచివాడు చెప్పండి. ఇంకెవరైనా అయితే చప్పిడి కాకుండా ఇంకొంత డబ్బు డ్రా చేసి.. అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు.

ఫోన్ కాల్ అందిన వెంటనే పోలీసులు స్పాట్‌కు చేరుకున్నారు. తొలుత అప్పటికే అక్కడ భారీగా గుమికూడిన జనాన్ని క్లియర్ చేశారు. ఆపై ఇన్‌స్పెక్టర్‌ శివకుమార్‌ ఆ ఏటీఎం సెంటర్ లోపలికి వెళ్లి..  పరీక్షించగా రూ.500 డ్రా చేస్తే రూ.2500 వస్తున్నట్లు నిర్ధారించారు. వెంటనే ATM సెంటర్ క్లోజ్ చేయించి.. సదరు బ్యాంకు సిబ్బందికి సమాచారమిచ్చారు. టెక్నికల్ సమస్యల కారణంగా ఇలా జరిగి ఉంటుందని బ్యాంకు సిబ్బంది తెలిపారు. త్వరలోనే సమస్యను సాల్వ్ చేసి.. ఏటీఎం సెంటర్ రీ ఓపెన్ చేస్తామని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం