సూపర్… ఐడియా అదిరింది గురూ!

హైదరాబాద్ లో రాత్రి వేళల్లో ఆటోలోనో, క్యాబ్‌లోనో వెళ్లాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. అందుకే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోను ఆశ్రయించాడో కుర్రాడు. పైసా ఖర్చు లేకుండా హాయిగా ఇంటికి చేరుకున్నాడు.  వివరాల్లోకెళితే… ‘రాత్రి 11 గంటల 50 నిమిషాలకు. నేను ఇనార్బిట్‌మాల్‌ రోడ్‌లో ఉన్నా. రూంకు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తున్నా. ఎంతసేపటికీ ఆటో రాకపోవడంతో ఉబెర్‌ యాప్‌ ఓపెన్‌ చేశా. కానీ చార్జీ రూ. 300 దాకా అవుతుందని చూపించింది. అప్పుడే […]

సూపర్... ఐడియా అదిరింది గురూ!

Edited By:

Updated on: Aug 16, 2019 | 7:55 PM

హైదరాబాద్ లో రాత్రి వేళల్లో ఆటోలోనో, క్యాబ్‌లోనో వెళ్లాలంటే జేబుకు చిల్లు పడటం ఖాయం. అందుకే ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటోను ఆశ్రయించాడో కుర్రాడు. పైసా ఖర్చు లేకుండా హాయిగా ఇంటికి చేరుకున్నాడు.  వివరాల్లోకెళితే…

‘రాత్రి 11 గంటల 50 నిమిషాలకు. నేను ఇనార్బిట్‌మాల్‌ రోడ్‌లో ఉన్నా. రూంకు వెళ్లేందుకు ఆటో కోసం చూస్తున్నా. ఎంతసేపటికీ ఆటో రాకపోవడంతో ఉబెర్‌ యాప్‌ ఓపెన్‌ చేశా. కానీ చార్జీ రూ. 300 దాకా అవుతుందని చూపించింది. అప్పుడే ఆకలి మొదలైంది. దీంతో జొమాటో యాప్‌ ఓపెన్‌ చేసి చుట్టుపక్కల ఏదైనా ఫుడ్‌ స్టోర్‌ ఉందేమో చూశా. అక్కడ దగ్గర్లో ఉన్న ఓ దోశ బండి జొమాట్‌ యాప్‌లో కనిపించింది. వెంటనే ఆలస్యం చేయకుండా ఎగ్‌దోశ ఆర్డర్‌ చేశా. ఇంతలో ఆర్డర్‌ తీసుకోవడానికి డెలివరీ బాయ్‌ అక్కడికి వచ్చాడు. అతడికి ఫోన్‌ చేసి ఇది నా ఆర్డరేనని, నన్ను రూం దగ్గర దింపమని అడిగాను. అతడు వెంటనే సరేనన్నాడు. ఆర్డర్‌తో పాటు నన్నూ డ్రాప్‌ చేశాడు. అంతేకాదు సార్‌ 5 స్టార్‌ రేటింగ్‌ ఇవ్వండి ప్లీజ్‌ అని అడిగాడు. నేనూ సరేనన్నాను. ఉచిత ప్రయాణం అందించిన జొమాటోకు థ్యాంక్స్‌’ అంటూ ఒబేశ్‌ తాను చేసిన ఫ్రీ రైడ్‌ గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. ఈ స్టోరీ ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో జొమాటో కూడా ఒబేశ్‌ పోస్టుపై స్పందించింది. ‘సరికొత్త సమస్యలకు సరికొత్త పరిష్కారాలు’ అని జొమాటో కేర్‌ ట్వీట్‌ చేసింది.