AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుదైన రికార్డ్.. ‘న్యూయార్క్ టైమ్స్‌’లో కాళేశ్వరం

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఇప్పటికే గిన్నీస్‌ బుక్‌ రికార్డులకు ఎక్కి ఈ ప్రాజెక్ట్‌..మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన బాహుబలి గాయత్రి పంప్‌హౌస్‌ ఘనకీర్తి ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్‌ టైమ్స్‌ పలు కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్‌హౌస్‌గా రికార్డులకు ఎక్కిన గాయత్రి పంప్‌హౌస్‌ ఘనతను న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ ప్రముఖంగా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఘనతను […]

అరుదైన రికార్డ్.. ‘న్యూయార్క్ టైమ్స్‌’లో కాళేశ్వరం
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2019 | 8:43 PM

Share

కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకంగా ఇప్పటికే గిన్నీస్‌ బుక్‌ రికార్డులకు ఎక్కి ఈ ప్రాజెక్ట్‌..మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా లక్ష్మీపూర్‌లో నిర్మించిన బాహుబలి గాయత్రి పంప్‌హౌస్‌ ఘనకీర్తి ఇప్పుడు ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్‌ టైమ్స్‌ పలు కథనాలను ప్రసారం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పంప్‌హౌస్‌గా రికార్డులకు ఎక్కిన గాయత్రి పంప్‌హౌస్‌ ఘనతను న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ ప్రముఖంగా ప్రస్తావించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ఘనతను ప్రపంచానికి తెలిసేలా న్యూయార్క్‌లోని ఓ కూడలిలో ఏర్పాటు చేసిన బిగ్‌ స్క్రీన్‌పై పలు వార్త కథనాల్ని ప్రసారం చేసింది. రోజుకు ఐదుసార్ల చొప్పున మొత్తం మూడు రోజుల పాటు గాయత్రి పంప్‌హౌస్‌, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ గొప్పదనాన్ని, విశిష్టతలను వివరిస్తూ న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ స్టోరీలను ప్రసారం చేసింది.

కాగా ఈఫిల్ టవర్ ఎత్తును మించిన పొడవుతో గాయత్రి (లక్ష్మీపూర్) పంపుహౌజ్‌ను మేఘా ఇంజనీరింగ్ తీర్చిదిద్దింది. ప్రపంచంలోనే గొప్ప ఇంజనీరింగ్ కళాఖండంగా ఈ పంపుహౌజ్ ప్రపంచ ఇంజినీరింగ్‌ చరిత్రలో నిలిచిపోయింది. ప్రపంచంలోనే అత్యధిక సామర్థం ఉన్న పంపులు 139 మెగావాట్లను ఉపయోగిస్తూ 111 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయాలన్న సంకల్పంతో దీన్ని మేఘా ఇంజినీరింగ్‌ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా దీన్ని నిర్మించింది.

ఇదిలా ఉంటే ప్రపంచంలోనే ఈ పంప్‌హౌస్ అతి పెద్దది. ఇంతకు ముందెన్నడూ లేనిది. అందులోనూ భూగర్భంలోనిది. శక్తిరీత్యా, సామర్థాల ప్రకారం, నీటి పంపింగ్ లక్షం, పరిమాణం..ఇలా ఏ ప్రకారం చూసినా, గాయత్రి పంపుహౌజ్ ఇంజనీరింగ్ కళాఖండం. మానవ నిర్మిత ప్రపంచ అద్భుతాల్లో చేరే అన్ని లక్షణాలు దీనికి ఉన్నాయి. ప్రపంచంలో ఇంత పెద్ద నీటి పంపింగ్ కేంద్రం ఇంతవరకూ ఎక్కడా నిర్మించలేదు. ఒక్కో మిషన్ వారీగా చూస్తే సామర్థం 139 మెగావాట్లు కావడంతో ప్రపంచంలో ఇప్పటి వరకు ఇదే పెద్ద మిషన్. ఒక మొత్తం పంపింగ్ కేంద్రం ప్రకారం చూసినా 973 మెగావాట్లు కూడా అతి పెద్దది. ఇందులో వినియోగించిన ఎలక్ట్రికల్ మోటార్ పంపుహౌజ్‌లలో కాకుండా మొత్తంగా ప్రపంచంలో ఏ రంగంలోనూ ఇంత పెద్దది లేదు.

Follow Us
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
బంగారం కొనాలా వద్దా? శ్రావణ మాసంలో ధర తగ్గుతుందా? పెరుగుతుందా?
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ఆ జబర్దస్త్ నటుడి పేరును మా ఫోన్‌లో 'గాడ్' అని సేవ్ చేసుకున్నాం
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
ప్రయత్నం చిన్నదే అయినా ఫలితం గొప్పగా ఉంటుంది.. తెలివైన కాకి కథ
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
రూ.10,000 SIPతో రూ.28.89 లక్షల రిటర్న్స్.. ధనవంతులను చేసిన ఫండ్!
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
మనీ ప్లాంటే కాదు..ఈ మొక్క ఇంటిలో ఉన్నా ఆస్తి పాస్తులు పెరగడం ఖాయం
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
టీ20 కెరీర్‌లోనే స్లోయెస్ట్ హాఫ్ సెంచరీ.. కట్‌చేస్తే..
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
జస్ట్ ఫేస్ స్కాన్‌తో గూగుల్ అకౌంట్ అన్‌లాక్.. ఎలా పనిచేస్తుంది?
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
పేపర్‌ లీక్‌ వ్యవహారంపై ప్రధాని మోదీ సంచలన నిర్ణయం
మామూలుగా ఉండదు మరి.. మంత్రితో చిన్నారుల ముచ్చట..
మామూలుగా ఉండదు మరి.. మంత్రితో చిన్నారుల ముచ్చట..
బిగ్‌బాస్ కప్పుతోనే బయటకు రావాలి.. నన్ను తీసుకోండి నాగ్ సార్
బిగ్‌బాస్ కప్పుతోనే బయటకు రావాలి.. నన్ను తీసుకోండి నాగ్ సార్