Hyderabad: ఆన్‌లైన్‌లో మ్యాక్‌బుక్ ఆర్డర్ పెట్టిన యువకుడు.. పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే షాక్

|

Mar 30, 2022 | 3:52 PM

మంచి మ్యాక్‌బుక్ కొనుక్కోవాలని ఆశపడ్డాడు ఓ వ్యక్తి. ఫీచర్స్ బాగా వెరిఫై చేసుకుని అమెజాన్‌లో ఒకటి ఆర్డర్ పెట్టాడు. తీరా పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూసి కంగుతిన్నాడు.

Hyderabad: ఆన్‌లైన్‌లో మ్యాక్‌బుక్ ఆర్డర్ పెట్టిన యువకుడు.. పార్శిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే షాక్
Online Order
Follow us on

ఇంటర్నెట్(Internet) ట్రెండ్ విపరీతంగా పెరిగాక.. ఇప్పుడు కొనే ప్రతి వస్తువును ఆన్‌లైన్‌ ద్వారానే ఆర్డర్ చేస్తున్నారు మెజార్టీ ప్రజలు. దీని వల్ల ఎన్ని ప్లస్‌లు ఉన్నాయో.. అన్ని మైనస్‌లు కూడా ఉన్నాయి. గతంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులకు బదులుగా రాళ్లు, సబ్బులు వచ్చిన ఘటనల గురించి విన్నాం. దీంతో కస్టమర్స్ కాస్త అలెర్ట్ అవుతున్నారు. ఆర్డర్ వచ్చిన తర్వాత.. దాన్ని ఓపెన్ చేసేటప్పుడు ఎందుకైనా మంచిదని వీడియో రికార్డు చేస్తున్నారు. ఏమైనా తేడా వస్తే.. ప్రూప్ ఉంటుందన్నది వారి ఆలోచన. తాజాగా మన హైదరాబాద్‌(Hyderabad)లో ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టగా.. వచ్చింది చూసి కంగుతిన్నాడు ఓ వినియోగదారుడు. వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లి(Kukatpally)కి చెందిన యశ్వంత్ అనే వ్యక్తి ఇటీవల అమెజాన్ వెబ్‌సైట్ ద్వారా మ్యాక్‌బుక్ ఆర్డర్ పెట్టాడు. అప్పుడే రూ.1,05,000 పేమెంట్ కూడా చేసేశాడు. మంగళవారం అతడికి అమెజాన్ నుంచి పార్శిల్ వచ్చింది. ఈ-కామర్స్ సైట్లలో ఒకటి బుక్ చేస్తే ఇంకోటి రావడం గురించి చాలా సార్లు ఇంటర్నెట్‌లో చూసిన యశ్వంత్.. అలర్ట్ అయి పార్శిల్ ఓపెన్ చేసేటప్పుడు వీడియో రికార్డ్ చేశాడు.

ఊహించని విధంగా పార్శిల్‌లో తాను ఆర్డర్ చేసిన మ్యాక్‌బుక్ రాకుండా.. పేపర్స్ కట్ట వచ్చింది. అది చూసి షాకైన యశ్వంత్ రికార్డు చేసిన ఆ వీడియోను జతచేసి ఈ-మెయిల్ ద్వారా ఈ విషయాన్ని అమెజాన్ సీఈఓ, సంస్థ ప్రతినిధులకు కంప్లైంట్ చేశాడు. వారి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: మంచు మనోజ్‌ కారును ఆపిన ట్రాఫిక్‌ పోలీసులు.. జరిమానా విధింపు..