Hyderabad: మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి.. ఆపి లగేజ్ చెక్ చేయగా

|

Jan 16, 2025 | 6:53 PM

పోలీసులు తీవ్రంగా కృషి చేస్తోన్నా మత్తుగాళ్లు మాత్రం మాట వినడం లేదు. తగ్గేదేలే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకుల గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్ గతంలో జైలుకు వెళ్లి వచ్చాడు. అయినా కానీ తన బుద్ది మార్చుకోలేదు. మరోసారి అదే తప్పు చేస్తూ పోలీసులకు చిక్కాడు. వివరాలు తెలుసుకుందాం పదండి...

Hyderabad: మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి.. ఆపి లగేజ్ చెక్ చేయగా
Miyapur Metro Station
Follow us on

అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ రన్ చేస్తున్నాడు. వచ్చే డబ్బులు తన జల్సాలకు సరిపోవడం లేదు. ఈజీ మనీ కోసం స్కెచ్ వేశాడు. పథకాన్ని బాగానే అమలు చేశాడు. కానీ ఖాకీలకు అడ్డంగా దొరికిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా ఇంద్రకుల గ్రామానికి చెందిన ఇంద్ర కుమార్‌‌కు (27) అరకులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అయితే అతని మనసు మాత్రం గంజాయి స్మగ్లింగ్ వైపు మళ్లింది. ఈ క్రమంలో.. అరకు నుంచి ఎండు గంజాయి తీసుకువచ్చి సొంతూరితో పాటు హైదరాబాద్ సిటీలో అమ్మేందుకు ప్లాన్ చేశాడు. గంజాయి తీసుకుని హైదరాబాద్ వచ్చి.. సొంతూరు వెళ్లే క్రమంలో పోలీసులకు పట్టబడ్డాడు. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో పిల్లర్ 603 దగ్గర.. అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఇంద్ర కుమార్‌ను మాదాపూర్ ఎస్ఓటీ, మియాపూర్ పోలీసులు తనిఖీ చేయగా గంజాయి వ్యవహారం వెలుగుచూసింది. నిందితుడి నుంచి 6.5 కిలోల గంజాయి పోలీసులు సీజ్ చేశారు. అయితే ఇంద్ర కుమార్ గతంలో అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తూ పట్టుబడి.. ఏడాది పాటు జైలుకి వెళ్లి వచ్చినట్లు అధికారుల విచారణలో తేలింది.

Indra Kumar

మత్తుపదార్ధాల ఆనవాళ్లు లేకుండా చేస్తామంటూ తెలంగాణ సర్కార్ గట్టి సంకల్పంతో ముందుకెళ్తుంటే… గుట్టుచప్పుడు కాకుండా బిజినెస్‌ చేస్తున్నారు కేటుగాళ్లు. రోజుకో పద్దతిలో డ్రగ్స్‌, గంజాయి స్మగ్లింగ్‌ చేస్తూ పోలీసులకే సవాల్‌ విసురుతున్నారు. అయితే ప్రభుత్వ ఆదేశాలతో గతకొన్ని రోజలుగా యమా స్పీడుమీదున్న పోలీసులు… మత్తుగాళ్ల ప్లాన్స్ గుట్టు రట్టుచేస్తున్నారు.  మత్తుపదార్ధాలు అన్న మాట వినిపిస్తే దబిడిదిబిడే అంటున్నారు పోలీసులు. మున్ముందు సీరియస్‌ డ్రైవ్ నిర్వహిస్తామని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..